పీరియడ్ డ్రామాలను ఫెరఫెక్ట్ గా చేస్తాడని పేరు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరోసారి నందమూరి బాలకృష్ణతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో “గౌతమీపుత్ర శాతకర్ణి,” “ఎన్టీఆర్ బయోపిక్స్” లాంటి విభిన్న చిత్రాల ద్వారా వీరిద్దరి కలయికకు విశేషమైన స్పందన లభించింది.
తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, బాలయ్య ఈ కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం పేరు “ఆదిత్య 999” కావచ్చని, 1990లో వచ్చిన కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” కి ఇది సీక్వెల్ కావచ్చని జోరుగా చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఫీమేల్ థ్రిల్లర్ “ఘాటి” రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న క్రిష్, ఆ సినిమా విడుదలైన వెంటనే — అక్టోబర్ నుంచి బాలయ్య కొత్త సినిమా స్క్రిప్ట్ పనుల్లో మునిగిపోనున్నారు.
బాలయ్య మాస్ ఇమేజ్‌ను బలంగా, గంభీరంగా చూపించగల దర్శకుల్లో క్రిష్ ముందు వరుసలో ఉంటాడు. అందుకే ఈ జంట మళ్లీ కలవబోతున్న వార్త ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
ఇది నిజంగానే “ఆదిత్య 999” అయితే, తెలుగు సినీప్రేక్షకులకి ఒక విభిన్నమైన విజువల్ ఫ్యాంటసీ జర్నీ కచ్చితంగా ఎదురవుతుంది!