రకరకాల కారణాలతో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రాబిన్ హుడ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆసీస్ మాజీ క్రికెటర్ డెవిడ్ వార్నర్ ను అసభ్యంగా తిట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం, రాజేంద్రప్రసాద్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. అదే సమయంలో తాజాగా ఆయనకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
రాబిన్ హుడ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చినప్పుడు రాజేంద్రప్రసాద్ కారులో నుంచి దిగి మరో వ్యక్తితో మాట్లాడుతూ.. కారు డోర్‌ను కాలితో తన్నినట్లుగా వీడియోలో కనిపిస్తుంది. దీంతో మద్యం మత్తులో రాజేంద్ర ప్రసాద్ ఈవెంట్‌కు వచ్చారంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
రాబిన్ హుడ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చినప్పుడు కారు డోర్‌ను కాలితో తన్నిన నటుడు రాజేంద్ర ప్రసాద్
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2025
మద్యం మత్తులో రాజేంద్ర ప్రసాద్ ఈవెంట్‌కు వచ్చారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు https://t.co/CqsWyNY8KE pic.twitter.com/RHJDXZhFfX
మరోవైపు అది క్యాజువల్ గా చేసిందేనని.. దాన్ని అంతలా రచ్చ చేయాల్సిన అవసరం లేదంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో అయితే ఫుల్ వైరల్ గా మారింది.