ఇండియన్ ఐకానిక్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (Ntr), కియారా అద్వానీ (Kiara Advani) కాంబోలో ‘వార్ 2’ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఆగస్ట్ 14న రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీకి సంభందించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అది మరేదో కాదు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి.
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇది పండగే! డాన్స్ ఐకాన్స్ అయిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లను ఒక్క స్టేజిపై చూసే అవకాసం రాబోతోంది. అభిమానుల కల నిజం కాబోతుంది. ‘వార్ 2’ బిగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్ అయింది.
ఆగస్ట్ 10న విజయవాడలో హీరోల సందడి!
తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్‌తో వెళ్తున్న ‘వార్ 2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆగస్ట్ 10న విజయవాడలో జరగనుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సహా మొత్తం టీమ్ ఈ కార్యక్రమానికి హాజరవుతుందని అఫీషియల్‌గా తెలియజేశారు.
ఇంటెన్స్ క్లాష్ vs రాయల్ ప్రెజెంటేషన్
ఒక వైపు రజనీ – లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న ‘కూలీ’… మరోవైపు యశ్‌రాజ్ ఫిలింస్ నుంచి టెక్నికల్గా అత్యున్నతంగా రూపొందుతున్న ‘వార్ 2’. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండింటి మధ్య ఢీకొన్నా, ప్రమోషన్స్ పరంగా మాత్రం ‘వార్ 2’ బరిలో ముందుగా దిగుతోంది.
పాటలపై పీక్స్‌లో అంచనాలు
ఇదిలా ఉంటే, మూవీ నుంచి పాటలు త్వరలోనే ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. మ్యూజిక్ ఆల్బమ్ ఓ రేంజ్‌లో వుందనే టాక్ బిజినెస్ వర్గాల్లో ఫుల్ జోరుగా వినిపిస్తోంది.
ఇక స్టేజ్‌పై ఎన్టీఆర్ – హృతిక్ పంచులు
ప్రమోషన్‌కి ఎవరెవరో వస్తారని అనుకున్నా… ఇప్పుడు మాత్రం నేరుగా ఫుల్ టీమ్‌తో పాటు ఎన్టీఆర్ – హృతిక్ కలిసి మెరుస్తారని ఖరారు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ స్టేజ్‌పై ఎలా ఉంటుందో చూడాలంటే మరో 10 రోజులు ఓపిక పట్టాలి.
మాస్‌తో కలిసిపోతున్న ‘వార్ 2’ ప్రొమోషన్స్!
తెలుగు ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ క్రేజ్‌తో పాటు హృతిక్ స్టైల్ యాక్షన్‌తో ‘వార్ 2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మాస్, క్లాస్‌కి కామన్ కాన్వెక్షన్ అవ్వబోతోంది.
ఇది కేవలం ప్రీ-రిలీజ్ ఈవెంట్ కాదు… స్టార్ స్టేజీపై స్టార్ యుద్ధం!