రీసెంట్ గా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన ‘డ్రాగన్’ సుందరి కయాదు లోహార్… తన అందంతో, గ్లామర్‌తో, గార్జియస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ర్యాపిడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న న్యూటేజ్ బ్యూటీ. సోషల్ మీడియా నుంచి సినీ ఇండస్ట్రీ వరకు ఆమె ఫాలోయింగ్ పీక్స్‌లో ఉంది.
ఇలా వేగంగా ఎదుగుతున్న యంగ్ హీరోయిన్ పేరు సినిమాల్లో కాదు… మద్యం కుంభకోణాల్లో వినిపించడం ఎంతో బాధాకరం. ఆమె పేరు ఇప్పుడు తమిళనాడు టాస్మాక్ మద్యం స్కామ్‌లో చక్కర్లు కొడుతోంది!
తాజాగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ దాడుల్లో కయాదు పేరు వెలుగులోకి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మద్యం స్కాంలో కీలక నిందితులు నిర్వహించిన ప్రైవేట్ పార్టీలకు ఆమె హాజరయ్యిందని, ఒక్కో పార్టీకి రూ. 35 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపణలు వస్తుండటం షాకింగ్.
అధికారికంగా ఈ విషయాలను నిర్ధారించే సాక్ష్యాలు బయటకు రాలేదు. కానీ మీడియాలో ఈ విషయాలు గుప్పుమన్నారు. అలాగే ఆమె టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఖండన, క్లారిటీ రాలేదు.
ఇప్పుడిప్పుడే కెరీర్ గేర్‌లోకి వస్తున్న కయాదు పేరు ఇలాంటి వివాదాల్లో లింక్ అవుతుండటం ఆమె సినిమాలపై ప్రభావం చూపించకుండా ఉండదు.
తమిళంలో సిలంబరసన్ సరసన ‘STR49’లో నటిస్తున్న ఈ బ్యూటీ, కెమెరా ముందు తన ప్రతిభను చూపించే సమయాన, ఈడీ ఛాయల్లో చిక్కుకుందంటే… అందం ఎంత ఉన్నా, క్రేజ్ ఎంత పెరిగినా… ఒక్క వివాదమే ఎన్ని ప్రశ్నలు లేపుతుందో నిదర్శనం ఇది!
ఇప్పుడు మీడియా,సినిమా పరిశ్రమ ఎదురు చూస్తోంది – కయాదు ఈ విషయపై మౌనం వీడి, నిజాలను బయటపెడతుందా? లేక ఈ ఆరోపణలు ఆమె కెరీర్‌ను మసకబార్చుతాయా?