దశాబ్ధాలుగా మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంఛైజీ తన ఫ్యాన్స్ ని ఎగ్జయిట్ చేస్తూనే ఉంది. ఇంతకుముందు మిషన్ ఇంపాజిబుల్ (ఎంఐ) : డెడ్ రికనింగ్ విడుదలై సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ది మిషన్ ఇంపాజిబుల్: ఫైనల్ రికనింగ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన ట్రైలర్ ని టామ్ స్వయంగా రిలీజ్ చేయగా అది సంచలనంగా మారింది.
ప్రతి ఎంపిక, ప్రతి మిషన్, అన్నీ దీనికి దారితీశాయి. మిషన్: ఇంపాజిబుల్- ది ఫైనల్ రెకనింగ్. 23 మే 2025న థియేటర్లలోకి వస్తోంది! అని తెలిపారు. మిషన్ ఇంపాజిబుల్ – ఫైనల్ రికనింగ్ తెలుగు ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేసారు. ఆసక్తికర ట్రైలర్ మీరు కూడా చూసేయండి..
ఇప్పటివరకు మిషన్ ఇంపాజిబుల్ లో 7 సినిమాలు రాగా ఇప్పుడు ఎనిమిదవ సినిమా రాబోతుంది. మిషన్ ఇంపాజిబుల్ 7వ సినిమా డెడ్ రికనింగ్ కు కంటిన్యూగా ఫైనల్ రికనింగ్ సినిమా రానుంది.