కొన్ని కాంబినేషన్స్ తెరపై మంచి క్రేజ్ క్రియేట్ చేస్తాయి.అలాంటి కాంబో ఒకటి త్వరలో సెట్ కాబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినపడుతోంది. గత కొంతకాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తోన్న హీరో రామ్‌ ఈసారి ఓ యువ దర్శకుడికి అవకాశమిచ్చాడు.

ఇంతకు ముందు రారా కృష్ణయ్య, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలను తెరకెక్కించిన మహేష్‌ బాబు.పితో రామ్‌ ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. రామ్‌ సరసన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రం లో ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ హీరో అవసరం ఉంది. మొదట మోహన్ లాల్ అనుకుని కథ కూడా వినిపించారట. ఆయన సానుకూలంగా స్పందించినట్టు టాక్ వచ్చింది.

కానీ తర్వాత ఏవో కారణాల వల్ల లాలెట్టన్ బదులు ఉపేంద్రతో సంప్రదింపులు జరుపుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ స్టోరీకి సంబంధించి డిస్కషన్స్ చేసినట్టు తెలిసింది.

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టైటిల్ ప్రచారంలో ఉంది కానీ యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మే 15 రామ్ పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో టీజర్ తో పాటు పేరుని ప్రకటించాలా వద్దానే మీమాంస కొనసాగుతోంది. దసరా లేదా దీపావళి విడుదలను టార్గెట్ చేసుకుంటున్న ఈ మూవీని వీలైనంత పోటీ లేకుండా సోలోగా దింపాలని మైత్రి ప్లాన్.

,
You may also like
Latest Posts from