రోజుకో దర్శకుడు, నటుడు రివ్యూలపై అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్ కార్తీక్ సుబ్బరాజ్ చేరారు. ఆయన దర్శకత్వంలో సూర్య, పూజా హెగ్డే జంటగా వచ్చిన తాజా చిత్రం “రెట్రో” — తమిళంలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, తెలుగులో మాత్రం అంచనాలను తీరుస్తలేకపోయింది.

ఈ సినిమాపై విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది సూర్య పెర్ఫార్మెన్స్‌ను ప్రశంసిస్తే, మరికొందరు కథలోని లోపాలు, స్క్రీన్‌ప్లే బలహీనతల్ని విశ్లేషించారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

“ఆన్‌లైన్ రివ్యూలను చూడొద్దని అనడం లేదు. కానీ కొన్ని రివ్యూల వెనక స్పష్టమైన అజెండా ఉంటుందని అనిపిస్తుంది. అది నిజాయితీగా రాసినదా? లేక ఎలాంటి ఉద్దేశంతోనో రాసిందా? అన్నదే అసలు ప్రశ్న. అందుకే ‘రెట్రో’ విడుదల తర్వాత నేను ఆన్‌లైన్ రివ్యూలు పూర్తిగా దూరం పెట్టేశాను” అని ఆయన అన్నారు.

, , ,
You may also like
Latest Posts from