2021లో నెట్‌ఫ్లిక్స్‌పై విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొరియన్ థ్రిల్లర్ స్క్విడ్ గేమ్, ఇప్పటికే రెండు సీజన్లతో ప్రేక్షకులను మాయ చేసింది. ఇప్పుడు మూడో సీజన్ టీజర్‌ను విడుదల చేశారు. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం, స్క్విడ్ గేమ్ 3 జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పటివరకు జరిన కథ ఏమిటి?
ప్రముఖ కొరియన్ నటుడు లీ జంగ్ జే పోషించిన షియెంగ్ జీ హున్ పాత్ర గేమ్‌ను గెలిచి 45.6 బిలియన్ కొరియన్ వాన్ సంపాదించినా, ఆ ఆట అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. డబ్బుతో నిండిన జీవితాన్ని అనుభవించాల్సిన అతడు, ఆ దుర్మార్గపు ఆట వెనక ఉన్న రహస్యాలను తేల్చేందుకు ప్రయాణం మొదలుపెడతాడు.
ఇంతలో తన అన్నయ్యను వెతుకుతున్న డిటెక్టివ్ హ్వాంగ్ జున్ హో మళ్ళీ రంగంలోకి దిగుతాడు. ఈ ఇద్దరూ కలిసి మాస్క్ ధరించిన “ఫ్రంట్ మ్యాన్” అనే వ్యక్తిని పట్టుకోవడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. సీజన్ 2 చివర్లో, ఫ్రంట్‌మ్యాన్‌ను కనుగొన్న షియెంగ్ జీ హున్… ఇక ఆటకు చెక్ పెట్టే స్థితికి చేరతాడు.
ఇప్పుడు ‘స్క్విడ్ గేమ్ 3’లో ఏం జరుగనుంది?
“చివరి ఆటలను ఆడటానికి సమయం వచ్చేసింది” అంటూ నెట్‌ఫ్లిక్స్ చేసిన వ్యాఖ్య చూసి, ఇది ఫైనల్ సీజన్ కావొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈసారి షియెంగ్ జీ హున్ పూర్తిగా గేమ్ ఆర్గనైజేషన్‌ను కూల్చే లక్ష్యంతో ముందుకు వెళ్తాడు. ఫ్రంట్‌మ్యాన్‌ను అంతం చేశాడా? లేక అతనికే మళ్లీ బలయ్యాడా? అనే ఉత్కంఠలో అభిమానులు ఉన్నారు.
ఇదే ముగింపు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు..!
రియాలిటీ షో తరహాలో, గేమ్ ఆధారిత కథనంతో.. మానవ స్వభావం, స్వార్థం, మరియు వ్యవస్థల పై ఆలోచింపజేసే ‘స్క్విడ్ గేమ్’ ఇప్పుడు తుదిపోరాటం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే టీజర్‌కు భారీ స్పందన లభిస్తోంది.
స్ట్రీమింగ్ ప్రారంభం: జూన్ 27, 2025
వేదిక: నెట్‌ఫ్లిక్స్
ఒక్క మాటలో చెప్పాలంటే: చివరి ఆట ప్రారంభమైంది!