పద్మశ్రీ కమల్ హాసన్ – మణిరత్నం కలయిక అంటేనే మినిమం గ్యారంటీ ఓ క్లాస్ క్లాసిక్. ఇప్పుడు ఆ కలయికే మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పై దుమ్ము లేపేందుకు రెడీ అవుతోంది.
థగ్ లైఫ్ అంటూ వస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌పై దేశవ్యాప్తంగా సినిమాప్రేమికుల అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విడుదలైన నాటి నుంచే సినిమా చుట్టూ సెన్సేషనల్ బజ్ స్పీడ్ పెంచేసింది. ముఖ్యంగా కమల్ లుక్, ఏటిట్యూడ్, మణిరత్నం మార్క్ విజువల్స్… ఇవన్నీ కలిసి పాన్ ఇండియా రేంజ్ హైప్ తెచ్చాయి.
అందుకే ఇప్పుడు సినిమాలో ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా, ఆన్‌లైన్‌లో నిమిషాల్లో వైరల్ అవుతోంది. తాజాగా బయటకు వచ్చిన ఇంట్రస్టింగ్ డిటెయిల్ ఏంటంటే… కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ కూడా థగ్ లైఫ్ కోసం తన టాలెంట్ ని బయిటకు తీసింది!
ఆమె స్వరంతో ఒక సౌండ్ బ్లాస్ట్ వచ్చేస్తోంది –
“విన్వెలి నాయకా” అనే ప్రత్యేక పాటకు శృతి హాసన్ వాయిస్ ఇచ్చింది.
ఈ పాట ఇప్పటికే రికార్డ్ అయ్యిందట. త్వరలో ఆడియో నుంచి అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.
థగ్ లైఫ్ క్యాస్ట్ & క్రూ
ఈ మాస్ + క్లాస్ థ్రిల్లర్‌లో కమల్ హాసన్‌తో పాటు సింబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇంకా ట్రిషా, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, సానియా మల్హోత్రా, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు.
మ్యూజిక్ ఏఆర్ రెహ్మాన్ స్వరాలతో మేజిక్ రెడీ చేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని కమల్ హాసన్ – మణిరత్నం కలిసి నిర్మిస్తున్నారు.
థగ్ లైఫ్ జూన్ 5న థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఇది పాన్ ఇండియా రిలీజ్ కానుంది.