గత రెండు రోజులుగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ పేరు చుట్టూ సునామీ లా నెగిటివ్ ట్రోల్స్ తిరుగుతున్నాయి. కారణం? ఆయన తమ్ముడు, నటుడు ఫైసల్ ఖాన్ చేసిన షాకింగ్ కామెంట్స్!
ఫైసల్ బాంబు పేల్చేశాడు – “నా అన్నయ్య అమీర్ నన్ను ఏడాది పాటు రూమ్‌లో బంధించాడు. ఫోన్ లాగేశాడు. బాడీగార్డ్స్ పెట్టి బయటకు వెళ్లనివ్వలేదు. రోజూ మందులు ఇచ్చేవారు. నన్ను పిచ్చివాడిలా ట్రీట్ చేశారు!”
ఈ మాటలతో నెట్టింట ఫుల్ ఫైర్ — “ఇదేనా సితారే జమీన్ పర్ హీరో?”, “సొంత తమ్ముడికి ఇలా చేస్తారా?” అంటూ కమెంట్స్ వర్షం.
అయితే, మొదట సైలెంట్‌గా ఉన్న అమీర్ ఫ్యామిలీ చివరికి బ్రేక్ ఇచ్చింది. ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేస్తూ — “ఇది మా పర్సనల్ మ్యాటర్. ఫైసల్ కోసం డాక్టర్ల సలహాతో, అతని మంచికే నిర్ణయాలు తీసుకున్నాం. దయచేసి దీన్ని గాసిప్‌గా మార్చొద్దు. మా కుటుంబం బాధపడేలా ఆర్టికల్స్ రాయకండి” అని వార్నింగ్ మోడ్‌లో స్పందించారు.
కానీ సోషల్ మీడియాలో అయితే ఈ నోట్ కూడా ఫైర్‌ని ఆర్పలేకపోయింది. ఫైసల్ ఇంటర్వ్యూ క్లిప్స్, అమీర్ పాత వీడియోలతో మీమ్స్ మళ్లీ మళ్లీ షేర్ అవుతున్నాయి.
ఇక అమీర్ విషయానికి వస్తే, “సితారే జమీన్ పర్” తో ఇటీవల థియేటర్స్‌లో కనిపించాడు. ₹122 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ ₹250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు కొట్టింది. కానీ ఇప్పుడు ఆయన నిజ జీవితం స్క్రిప్ట్ మాత్రం బాక్సాఫీస్ హిట్ కంటే ఎక్కువ డ్రామా, కాంట్రవర్సీతో నిండిపోయింది.