సినిమా గాసిప్స్సినిమా వార్తలు

అజిత్‌ రెమ్యూనరేషన్ షాక్: నిర్మాతలు భయంతో పరార్?

తమిళ నిర్మాతలలో గుసగుసలు… “అజిత్‌ మార్కెట్‌కు ఇది మరీ ఎక్కువగాగా?” అనే మాటలు! తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కి ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే వేరే లెవెల్‌. హిట్స్, బ్లాక్‌బస్టర్స్, కొన్ని సెట్‌బ్యాక్స్—అన్నింటినీ దాటుకుని తన స్టార్డమ్‌ని నిలబెట్టుకున్న హీరో. కానీ ఇప్పుడు ఆ స్టార్ పవర్‌నే నిర్మాతలకు హీట్ గా మారిందని టాక్‌!

గత వేసవిలో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అజిత్ కెరీర్‌లోనే భారీ హిట్‌. దాని తర్వాత మళ్లీ అదే దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్‌తో సినిమా లాక్‌ అయిపోయింది. స్క్రిప్ట్ రెడి… హీరో రెడి… కానీ అనౌన్స్‌మెంట్? లేదు! ఎందుకు?

అసలు ఇబ్బంది ఏంటంటే… అజిత్‌ అడిగిన పారితోషికమే!

నిర్మాతలు ₹150 కోట్లు ఆఫర్‌ చేసేందుకు సిద్ధంగా ఉంటే… అజిత్ మాత్రం అదికంటే చాలా భారీగా డిమాండ్ చేస్తున్నాడట. ఈ డిమాండ్‌తో ప్రాజెక్ట్ మొత్తపు బడ్జెట్ ₹300 కోట్లపైకి ఎగబాకేసింది! ఇంత భారీ బడ్జెట్‌కు థియేట్రికల్ బిజినెస్, నాన్-థియేట్రికల్ రికవరీ అన్నీ రిస్క్‌గా మారడంతో… “ఇంటరెస్ట్ ఉంది” కానీ “వెనక్కి వెళ్లిపోవడం” అనే సీన్‌ రిపీట్ అవుతూనే ఉంది.

అజిత్ స్టార్డమ్ vs మార్కెట్ రియాలిటీ!

అజిత్‌కి తమిళనాడులో విజయ్, రజనీకాంత్ లెవెల్ స్టార్డమ్ ఉన్నా… అవుట్‌సైడ్ మార్కెట్ మాత్రం అంతగా స్ట్రాంగ్ కాదు. అదీ కాక OTTలు కూడా ఇక ఎత్తైన రేట్లు ఇవ్వడంలేదు. అంటే రిస్క్ డబుల్!

దీంతో… అధిక్ – అజిత్ కాంబో సినిమా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి మాత్రం డిసప్పాయింట్‌మెంట్. పెరుగుతున్న ఖర్చులు, అజిత్ డిమాండ్లు— అంతా కలిసి మూవీ లాంచ్, అనౌన్స్‌మెంట్ మళ్లీ మళ్లీ పొస్ట్‌పోన్ అవుతున్నాయి.

“అజిత్ డిమాండ్ ఇండస్ట్రీ లిమిట్స్‌ని దాటిందా?”
“ఈ ప్రాజెక్ట్ అసలు మొదలవుతుందా?”
మూవీ నడకపై ఇండస్ట్రీ మొత్తం గట్టిగా వాచ్ చేస్తోంది!

Similar Posts