సినిమా వార్తలు

పూజా హెగ్డే 2025లో ఏం చేసిందో తెలుసా?

రెండేళ్ల పాటు వరుస ఫ్లాపులు… 2024లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవడం… 2023లో వచ్చిన ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర కూలిపోవడంతో చాలామంది “పూజా కెరీర్ అయిపోయింది” అని ఫిక్స్ అయిపోయారు.

కానీ 2025 మాత్రం ఆమెకు గ్యాంగ్ రివర్స్ చేసిన ఏడాది!

సూర్యాతో చేసిన ‘Retro’ కమర్షియల్‌గా పెద్దగా అందుకోకపోయినా, రజనీకాంత్ ‘Coolie’లో వచ్చిన ఆమె స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో నెలల తరబడి ఫైర్ అయ్యింది. ఆ పాటే ఆమెను తిరిగి ట్రెండింగ్‌లోకి తెచ్చింది.

2025లో పూజా హెగ్డే కి మూడు సినిమాలు వచ్చాయి. ఇంకో భారీ రిలీజ్ — విజయ్ ‘జన నాయకుడు’ — 2026 జనవరిలో రాబోతోంది.
అదికాక ఇంకా రెండు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి, అందులో ఒక తెలుగు సినిమా ప్రస్తుతం షూటింగ్‌లో ఉంది. మొత్తానికి… పూజా షెడ్యూల్ మళ్లీ ఫుల్!

తన జర్నీ గురించి పూజా హెగ్డే చెప్పిన మాటల్లోనే అసలు ట్విస్ట్ ఉంది:

“ఇది నాకు క్రియేటివ్ గా టర్నింగ్ పాయింట్. ప్రత్యేకంగా ‘Retro’లో నా రోల్ కి వచ్చిన రెస్పాన్స్… ‘మోనికా’ సాంగ్ మాస్ రేంజ్ లో పాపులర్ కావడం… ఇవన్నీ చాలా ఫిలింగ్ ఇచ్చాయి” అని Travel + Leisure Magazine కి చెప్పింది.

మొత్తానికి—
‘కెరీర్ అయిపోయిందా?’ అనిపించిన చోట…
పూజా హెగ్డే 2025లో చేసింది ‘సాలిడ్ కం‌బ్యాక్’!

Similar Posts