
మహేష్ బాబు సినిమా వల్లే టాలీవుడ్‌కు గుడ్‌బై: రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్!
టాలీవుడ్లో వరుస విజయాలతో టాప్ రేంజ్ హీరోయిన్గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘కెరటం’ నుంచి ‘సరైనోడు’, ‘ధ్రువ’, ‘నాన్నకు ప్రేమతో’ వరకు—అన్ని హిట్స్! అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, రవితేజ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో వరుస అవకాశాలు దక్కించుకున్న రకుల్ ఒక్కసారిగా టాలీవుడ్ నుంచి దూరం అయ్యింది ఎందుకు? ఇదే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.
“స్పైడర్… నా కెరీర్‌ను కుదిపేసిన సినిమా” – రకుల్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్ సూటిగా చెప్పింది:
“టాలీవుడ్లో నాకు వరుసగా ఎనిమిది, తొమ్మిది హిట్స్ వచ్చాయి. కానీ స్పైడర్… అది నా కెరీర్లో వచ్చిన తొలి పెద్ద డిజాస్టర్. ఆ ఒత్తిడిని నేను మానసికంగా హ్యాండిల్ చేయలేకపోయాను. నాపై వచ్చిన నెగెటివ్ కామెంట్స్, విమర్శలు చాలా బాధపెట్టాయి. అందుకే టాలీవుడ్ నుంచి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాను.”
ఈ ఒక్క మాటే ప్రస్తుతం సోషల్ మీడియాలో అగ్ని రాజేస్తుంది. స్పైడర్ తరువాత ఆఫర్స్ ఆమే తిరస్కరించిందట! భారీ అంచనాలతో వచ్చిన
మహేష్ బాబు – మురుగదాస్ ‘స్పైడర్’ ఫెయిలయ్యాక వచ్చిన అనేక మంచి అవకాశాలను కూడా రకుల్ స్వయంగా వదులుకున్నట్లు చెప్తోంది.
టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి కాదు… ఆమే వెనక్కి తగ్గింది అనే విషయం ఇదే మొదటిసారి బయటపడింది. బాలీవుడ్ వైపు టర్న్ తీసుకుంది. అక్కడ మళ్లీ ఫుల్లీ బిజీ అవుతోంది. తెలుగులోని నెగెటివ్ ఎనర్జీ నుంచి బయటపడటానికి రకుల్ బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ అయ్యారే, దేవ, దే దే ప్యార్ దే, థాంక్ గాడ్, ఛత్రీవాలీ వంటి చిత్రాలతో తాను మళ్లీ బిజీ అయింది.
పాన్ ఇండియా బ్రాండ్ల అంబాసడర్‌గా, OTT ప్రాజెక్టుల్లో కూడా ఆమెకు డిమాండ్ పెరిగింది.
మొత్తం మీద… రకుల్ ప్రీత్ చేసిన ఈ కామెంట్స్ మరోసారి టాలీవుడ్ ప్రెజర్, స్టార్ హీరో సినిమాల ప్రభావం, హీరోయిన్ కెరీర్స్‌లో వచ్చే సైకలాజికల్ ఒత్తిడిపై పెద్ద చర్చను తెచ్చాయి.
