సినిమా వార్తలు

సినీ లోకాన్ని కుదిపేసిన విషాదం… AVM దిగ్గజం ఇక లేరు!

భారతీయ సినీ పరిశ్రమలో లోగో కనిపించగానే గూస్‌బంప్స్‌ వచ్చే నిర్మాణ సంస్థలు చాలా అరుదు. అలాంటి అరుదైన చరిత్రను రాసుకున్నది ‘AVM ప్రొడక్షన్స్’. స్క్రీన్‌పై వారి సింబల్ మెరపితే… అది హిట్‌కు హామీ అన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉండేది.

కానీ ఆ లెజెండరీ సంస్థ వెన్నెముక, వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎం. శరవణన్ ఇక లేరు… 86 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూసిన వార్త సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది.

తమిళ్ నుంచి తెలుగు వరకు… ఆయన టచ్ ఉన్న సినిమాలు నేటికీ ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్:

శివాజీ, అయాన్ (వీడొక్కడే), యజమాన్, తిరుపతి, అలాగే తెలుగులో భక్త ప్రహ్లాద, మూగనోము, ఆ ఒక్కటి అడక్కు… ఒకటి రెండు కాదు, తరతరాల ప్రేక్షకులను మైమరపించిన మాస్టర్‌పీసులు.

వయోభారంతో వచ్చిన అనారోగ్యం ఆయనను మనకు దూరం చేసినా… ఆయన వదిలి వెళ్లిన సినీ వారసత్వాన్ని మాత్రం ఎవరూ చెరపలేరు.

సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ,
“ఇది ఇండియన్ సినిమాకు తిరుగులేని నష్టం” అంటున్నారు.

మా చలనచిత్రం డాట్ కాం తరఫున ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

Similar Posts