సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్‌లో నోరుజారిన ఫలితం.. ఇప్పుడు ఏకంగా సర్టిఫికేట్ కోసం అప్లై!

తమిళ విలక్షణ నటుడు పార్తిబన్ పేరు వినగానే ఒక వైవిధ్యమైన మేధావి గుర్తొస్తారు. కానీ అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుంటాయి. రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వేడుకలో పార్తిబన్ చేసిన ఒక ప్రకటన నెటిజన్లను ఉలిక్కిపడేలా చేసింది. ఆయన నోటి వెంట వచ్చిన ఆ ఒక్క మాట సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీయడంతో, దానికి చెక్ పెట్టేందుకు పార్తిబన్ ఎవరూ ఊహించని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలు ఆ వేదికపై ఏం జరిగింది? పార్తిబన్ ఎందుకు అంతలా హర్ట్ అయ్యారు? ఈ ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికేట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

ఒక్క మాటతో మొదలైన రచ్చ.. ట్రోలర్స్ అటాక్!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో పవన్‌కు ధీటైన విలన్‌గా నటిస్తున్న పార్తిబన్, షూటింగ్ సమయంలో తన సామాజిక వర్గం (కులం) గురించి ప్రస్తావించారనే వార్త వైరల్ అయింది. మేధావిగా పేరున్న పార్తిబన్ కూడా కులం పేరు చెప్పడం ఏంటని నెటిజన్లు ఏకిపారేశారు. ఈ విమర్శలు ఆయనను తీవ్రంగా బాధించాయి. దీంతో అసలు విషయం చెప్పడానికి ఆయన ఒక వీడియో విడుదల చేశారు. “నేను తెలుగు వాడినని చెప్పబోయి, పొరపాటున కులం పేరు వాడాను.. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు” అని క్లారిటీ ఇచ్చారు.

సంచలన నిర్ణయం.. ఇకపై నాకు అవేవీ వద్దు!

ట్రోలింగ్ వల్ల కలిగిన బాధ నుంచి ఒక విప్లవాత్మక అడుగు వేశారు పార్తిబన్. తనకి ఏ కులం, ఏ మతం లేదని అధికారికంగా చాటిచెప్పే ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికెట్ కోసం ఆయన గవర్నమెంట్ కు అప్లై చేశారు. ఇలాంటి ఒక సర్టిఫికేట్ ఉంటుందని తనకు ఇప్పుడే తెలిసిందని, వెంటనే దరఖాస్తు చేశానని ఆయన వెల్లడించారు. సమాజంలో కులమతాల గోడలు బద్దలు కొట్టడానికి ఇదొక గొప్ప ప్రారంభమని ఆయన భావిస్తున్నారు.

తొలి నటుడిగా రికార్డ్.. ఇదొక ఉద్యమం!

భారతీయ సినీ పరిశ్రమలో అధికారికంగా ఇలాంటి సర్టిఫికెట్ అందుకుంటున్న తొలి నటుడు తానే అవుతానని పార్తిబన్ ధీమా వ్యక్తం చేశారు. కేవలం పేపర్ మీద మాత్రమే కాదు, సమాజంలో కూడా మార్పు రావాలని, దీన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తానని ఆయన ప్రకటించారు. తన తెలుగు మూలాల పట్ల గౌరవం ఉందని, కానీ కుల పిచ్చి మాత్రం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. విలన్ గా కనిపించే పార్తిబన్, రియల్ లైఫ్ లో మాత్రం ఇలాంటి నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ లో మొదలైన చిన్న పొరపాటు, ఇప్పుడు ఒక పెద్ద సామాజిక మార్పుకు దారి తీయడం విశేషం!

Similar Posts