తెలుగు సినిమా నటి కల్పిక గణేష్‌పై హైదరాబాద్ లోని ఓ పబ్‌లో దాడి జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్‌లో శుక్రవారం రాత్రి నిర్వాహకులతో ఆమెకు గొడవ జరిగినట్లు చెప్తున్నారు. బర్త్ డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా.. అది పెద్దదై కల్పికపై అటాక్ చేసే వరకూ వెళ్ళింది.

పబ్ నిర్వాహకులు తనపై దురుసుగా ప్రవర్తించారని, బూతులతో రెచ్చిపోయారని కల్పిక చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోని నటి కల్పిక తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తనపై పబ్ నిర్వహకులు దురుసుగా ప్రవర్తించారని కల్పిక చెబుతోంది.

https://www.instagram.com/iamkalpika27/?utm_source=ig_embed&ig_rid=576fcd33-0ed7-4f7d-8abf-1b94e0ccbf43

అయితే గొడవ విషయమై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించాలని కల్పిక ఆరోపిస్తోంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదంలో నటిపై పబ్ సిబ్బంది దాడి చేశారని అంటున్నారు గానీ అందుకు తగ్గ ఫొటోలు, వీడియోలు ఏం బయటకు రాలేదు. దీంతో దాడి నిజంగా జరిగిందా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.

‘ఆరెంజ్’ మూవీలో జెనీలియా ఫ్రెండ్‌గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఈమెకు పెద్దగా ఆఫర్స్ లేవు.

You may also like
Latest Posts from