టైటిల్ హిట్ అయితే, హాఫ్ బిజినెస్ అయినట్లే! ఈ మాటని నిజం చేయటానికి తెలుగు సినిమా హిస్టరీలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి – సినిమా ఎలా ఉందో కంటే ముందు, టైటిల్ ఎలా ఉందనేది ప్రేక్షకుల్లో ప్రాథమిక ఆసక్తిని రేకెత్తిస్తుంది. ‘అర్జున్ రెడ్డి’, ‘జాతిరత్నాలు’, ‘బలగం’, ‘బాబు బంగారం’… ఇవన్నీ మొదట టైటిల్ వల్లే హైప్ తెచ్చుకున్న సినిమాలే. ఇప్పుడు అదే లైన్‌లోకి అల్లరి నరేష్‌ కొత్త సినిమా “ఆల్కహాల్” వచ్చేస్తోంది!

ఆల్కహాల్? కానీ… హీరో మాత్రం తాగడు!

అవును, టైటిల్ వినగానే వావ్ అనిపిస్తోంది కదూ? . కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే… ఇందులో హీరోకి అస్సలు మందు తాగే అలవాటు ఉండదట!
మరి అలాంటప్పుడు “ఆల్కహాల్” అనే టైటిల్ ఎందుకు పెట్టారు?
ఈ పేరే కథలోని సస్పెన్స్, డ్రామా, థ్రిల్ కు అద్దం అంటోంది టీం.

ట్రాక్ తప్పి… తిరిగి ట్రెండ్ వైపు

నాంది సినిమా ద్వారా సీరియస్ టర్నింగ్ తీసుకుని నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిన అల్లరి నరేష్, ఆ తరహాలో చేసిన ఉగ్రం, మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలతో మాత్రం ఫ్లాట్ రెస్పాన్స్ ఎదుర్కొన్నారు. నా సామిరంగాలో పనిచేసినా క్రెడిట్ నాగార్జున ఖాతాలో పడిపోయింది. కామెడీ రూట్ లోకి మళ్ళిన ఆ ఒక్కటీ… అడక్కు! కూడా పండలేదు. బచ్చల మల్లిలో డ్రామా ఓవర్ డోస్‌తో ప్రేక్షకుల నుంచి రీజెక్ట్ అయ్యారు.

ఇవన్నీ చూసిన అల్లరోడు ఇప్పుడు తన USP అయిన ‘క్రేజీ కంటెంట్’ వైపు ఫోకస్ పెడుతున్నారు.

ఆల్కహాల్ – ఒక డిఫరెంట్ డ్రింక్!

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇతడు ముందుగా OTTలో ‘ఫ్యామిలీ డ్రామా’ అనే క్రైమ్ థ్రిల్లర్ హిట్ కొట్టాడు.
అల్లరి నరేష్ ఆ సినిమా చూసే అతనితో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్.
ఇప్పుడు ఆల్కహాల్‌లో ఆయనను పూర్తి కొత్త జానర్‌లో చూపించబోతున్నారు.

👉 రుహానీ శర్మ హీరోయిన్
👉 జిబ్రాన్ సంగీతం
👉 అల్లరి నరేష్ మార్కు హాస్యం + థ్రిల్లింగ్ న్యారేషన్
👉 షూటింగ్ సగం పూర్తయ్యిందట

టైటిల్ మేక్స్ ది డిఫరెన్స్

‘ఆల్కహాల్’ అనే టైటిల్ వింటేనే యూత్ ఫుల్ కనెక్ట్ వచ్చేస్తోంది.
బిజినెస్ పరంగా కూడా క్రేజీ టైటిల్స్ డిస్ట్రిబ్యూషన్, ఓవర్సీస్ రైట్స్, OTT డీల్స్‌కు బూస్ట్ ఇస్తాయి.
ఈ సినిమా గురించి ఇంట్రెస్ట్ క్రియేట్ కావడంలో టైటిల్ కీలక పాత్ర పోషిస్తోంది.

You may also like
Latest Posts from