సినిమా వార్తలు

విశ్వక్ సేన్‌ ‘ఫంకీ’ కలెక్షన్స్ వీకెండ్ పరిస్దితి ఏమిటి

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి చతికిలపడ్డాడు. వరుస డిజాస్టర్ల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని, అనుదీప్ దర్శకత్వంలో ‘ఫంకీ’ (Funky) అంటూ ఒక హిలేరియస్ ఎంటర్‌టైనర్‌తో ముందుకొచ్చాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్, కాడు లోహర్ లాంటి క్రేజీ హీరోయిన్ ఉన్నా.. ఈ ‘ఫంకీ’ మ్యాజిక్ మాత్రం పని చేయలేదు. మొదటి రోజే నెగిటివ్ టాక్ రావడంతో విశ్వక్ ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు.

వాలెంటైన్స్ డే కూడా కాపాడలేకపోయింది!

శుక్రవారం విడుదలైన ‘ఫంకీ’ కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. అసలే నెగిటివ్ రివ్యూలు, దానికి తోడు ప్రేక్షకుల నుంచి స్పందన కరువవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. శనివారం వాలెంటైన్స్ డే ఉన్నా కూడా ఈ సినిమాకు ప్లస్ అవ్వలేదు. ఫుట్‌ఫాల్స్ పెరగకపోగా, సాయంత్రం ఆటలకు కూడా బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. విశ్వక్ సేన్ తన కథల ఎంపికపై పునరాలోచించాల్సిన సమయం వచ్చిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఫంకీ మూవీ మూడు రోజుల కలెక్షన్లు

ఫంకీ మూవీ రెండో రోజు కలెక్షన్లు చూస్తే, దాదాపు రెండు కోట్లు వసూలు చేసింది. మొదటి రోజుతో పోల్చితే సగం మాత్రమే వచ్చాయని చెప్పొచ్చు. మొత్తంగా రెండు రోజుల్లో రూ.6.55కోట్లు వసూలు చేసింది. నైజాంలో రూ.1.15కోట్లు, ఏపీలో కోటి, ఓవర్సీస్‌, ఇతర స్టేట్స్ అన్ని కలిపి రూ.1.25కోట్లు వసూలు చేసింది. ఇలా రెండో రోజుల్లో రూ.3.40కోట్ల షేర్‌, ఆరున్నర కోట్ల గ్రాస్‌ వచ్చింది. మూడో రోజుకి పూర్తి డ్రాప్ కనపడింది. అయితే ఆదివారం నైజాంలోని కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ కనపడినట్లు చెప్తున్నారు.

విశ్వక్‌ను దెబ్బకొట్టిన సంతోష్ శోభన్!

విశ్వక్ సేన్ ఒకవైపు షాక్‌లో ఉంటే.. మరోవైపు యంగ్ హీరో సంతోష్ శోభన్ బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాడు. అదే సమయంలో విడుదలైన సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాకు పాజిటివ్ టాక్ రావడమే కాకుండా, శని,ఆదివారం రాత్రి షోలకు హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. ఒక చిన్న సినిమా ఇలా దూసుకుపోతుంటే, పెద్ద అంచనాలతో వచ్చిన ‘ఫంకీ’ డిజాస్టర్ దిశగా వెళ్లడం విశ్వక్ సేన్ కెరీర్‌కు గట్టి ఎదురుదెబ్బే!

Similar Posts