సినీ ఇండస్ట్రీలో రూమర్లు రావడం కామన్, కానీ కొన్ని వార్తలు మాత్రం వింటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. తాజాగా యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఆయనకు ఒక సొంత ‘గోలీ ఫ్యాక్టరీ’ ఉందట, దాని ద్వారా నెలకు ఏకంగా మూడు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారట. ఈ మ్యాటర్ విన్న ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ విషయంపై రాజశేఖర్ గారు స్పందిస్తూ రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ తో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నాకే తెలియకుండా నాకో ఫ్యాక్టరీ ఉందా?
అసలు తనకే తెలియకుండా తన పేరు మీద ఒక ఫ్యాక్టరీ రన్ అవుతోందని, అది నెలకు రూ. 3 కోట్లు తెచ్చిపెడుతోందని వస్తున్న వార్తలు విని తానే ఆశ్చర్యపోయానని చెప్పారు. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ వార్తను నిజమని నమ్మి ఆయనకు తెలిసిన వాళ్లే ఫోన్ చేసి “సార్ నిజంగానే మీకు గోలీ ఫ్యాక్టరీ ఉందా?” అని అడుగుతున్నారట.

అడ్రస్ తెలిస్తే చెప్పండి.. నేనే వెళ్తా!
హోస్ట్ సరదాగా “అరే.. ఆ అడ్రస్ ఏదో నాకు కూడా చెప్పండిరా” అని మీరు అనుకున్నారు కదా అని అడగ్గా, రాజశేఖర్ గారు అవునన్నట్టుగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలిస్తే నేనే వెళ్తాను కదా అంటూ సెటైర్ వేశారు. మొత్తానికి సోషల్ మీడియాలో వచ్చే వింత వింత రూమర్లు సెలబ్రిటీలను కూడా ఎలా కన్ఫ్యూజ్ చేస్తాయో ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది.
సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండే రాజశేఖర్ గారికి ఇలాంటి విచిత్రమైన రూమర్లు రావడం కొత్తేమీ కాకపోయినా, ఈ ‘గోలీ ఫ్యాక్టరీ’ ఇష్యూ మాత్రం నెట్టింట రచ్చ చేస్తోంది.

