సినిమా వార్తలు

సెక్స్ అంటే సిగ్గు.. కానీ పిల్లలను తెగ కనేస్తారు! వరలక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్!

మన దేశంలో సెక్స్ గురించి మాట్లాడాలంటేనే చెవులు మూసుకుంటారు, కానీ జనాభాలో మాత్రం ప్రపంచానికే బాస్‌లా మారిపోతున్నాం! అసలు ఈ మ్యాజిక్ ఎలా జరుగుతోంది? పొయ్యిలో పిల్లి లేకపోయినా.. ఇంట్లో మాత్రం పిల్లల ఫ్యాక్టరీ నడిపే వాళ్లకి వరలక్ష్మి శరత్‌కుమార్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఫ్యూజులు ఎగరగొడుతోంది!

దక్షిణాది వెండితెరపై లేడీ విలన్‌గా, పవర్‌ఫుల్ నటిగా ముద్ర వేసుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ తాజాగా ‘ఎస్ సరస్వతి’ మూవీతో మెగా ఫోన్ పట్టి దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటుతోంది. అయితే సినిమా రిజల్ట్ పక్కన పెడితే, తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతోంది. మన సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను, పిల్లల పెంపకం వెనుక ఉన్న దారుణమైన లాజిక్‌ను ఆమె పచ్చిగా బయటపెట్టేసింది.

మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవాలు

వరలక్ష్మి మాటలు వింటే ఎవరికైనా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. “మన దేశంలో సెక్స్ గురించి మాట్లాడితే పాపం అన్నట్టు చూస్తారు, కానీ అందరూ ఆ పని చేస్తున్నారు కాబట్టే జనాభాలో మనం ముందున్నాం. ఇది చాలా విచిత్రంగా ఉంది” అంటూ ఆమె తన ఆవేదనను వెళ్లగక్కారు. శృంగారం అంటే సిగ్గు పడే వారు, పిల్లల్ని కనేటప్పుడు మాత్రం ఎందుకు ఆలోచించరని ఆమె నిలదీశారు.

అంతేకాదు, ఆర్థిక పరిస్థితులు పట్టించుకోకుండా పిల్లల్ని కనే తల్లిదండ్రులపై ఆమె ఘాటుగా స్పందించారు. “కొంతమంది పిల్లలను ఒక ఫ్యాక్టరీలా కనేస్తుంటారు. ఆ తర్వాత మాకు కష్టాలున్నాయని ఏడుస్తారు. అసలు కష్టాలున్నప్పుడు పిల్లల్ని ఎందుకు కనాలి? ఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఏంటి?” అని ప్రశ్నించారు.

మీ పిల్లలకు నేనెందుకు బాధ్యత వహించాలి?

వరలక్ష్మి విసిరిన అసలైన బాణం ఇక్కడే ఉంది. తన వద్దకు పిల్లల ఆర్థిక సహాయం కోసం వచ్చే వారిని ఉద్దేశించి ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. “మీరు పిల్లల్ని కనేసి, ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతారు. ఆ పిల్లల్ని నేనేమైనా కన్నానా? మీరు తీసుకున్న నిర్ణయానికి నేను ఎందుకు బాధ్యత వహించాలి? మీ పిల్లల బాధ్యతను మీరే తీసుకోవాలి” అంటూ నిర్మొహమాటంగా చెప్పేశారు.

వరలక్ష్మి వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. “ఆమె చెప్పింది పచ్చి నిజం, బాధ్యత లేని పేరెంటింగ్ దేశానికి శాపం” అని కొందరు మద్దతు ఇస్తుంటే, “పేదరికంలో ప్రేమ ఉండదా?” అని మరికొందరు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా ‘జయమ్మ’ రాజేసిన ఈ చిచ్చు అంత సులభంగా ఆరేలా లేదు.

Similar Posts