
“గోవిందా గలీజు బాగోతాలు.. భార్య సునీత సీరియస్ వార్నింగ్!
బాలీవుడ్ ‘చిచోరా’ స్టార్ గోవిందా ఇంట ఇప్పుడు రచ్చ మొదలైంది. వెండితెరపై తన డ్యాన్స్‌తో, కామెడీతో మెప్పించిన ఈ హీరో.. నిజజీవితంలో మాత్రం తన భార్య దగ్గర అడ్డంగా బుక్కైపోయినట్టు తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గోవిందా భార్య సునీత అహూజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
“అలాంటి వాళ్లు వస్తూ ఉంటారు.. కానీ గోవిందా నావాడే!”
గోవిందాకు చాలా ఏళ్లుగా ఇతర నటీమణులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై సునీత ఓపెన్ అయిపోయారు. “పైన దేవుడు దిగి వచ్చినా సరే.. గోవిందా నావాడే, మరెవరి వాడు కాదు” అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. “అతని జీవితంలోకి అలాంటి మహిళలు చాలా మంది వస్తూ పోతూ ఉంటారు.. కానీ చివరికి అతను నా దగ్గరకే రావాలి” అంటూ భర్తపై తనకున్న పట్టును చాటుకున్నారు.
“నేను నేపాలీని.. ఖుక్రీ తీస్తే అందరూ ఖతం!”
ఇక తన కోపం గురించి చెబుతూ సునీత మరింత మసాలా యాడ్ చేశారు. “నేను నేపాల్ నుంచి వచ్చాను. మా దగ్గర ‘ఖుక్రీ’ (నేపాలీ కత్తి) తీస్తే అందరూ ఇబ్బందుల్లో పడతారు. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలి” అని సరదాగా అంటూనే, తనను తక్కువ అంచనా వేయొద్దని పరోక్షంగా హెచ్చరించారు. “గోవిందాను నేను అంత ఈజీగా క్షమించను” అని తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు.
“అసలు నువ్వు తండ్రివేనా?”.. కొడుకు కెరీర్ పై ఫైర్!
తండ్రిగా గోవిందా ఫెయిల్ అయ్యారంటూ సునీత సంచలన ఆరోపణలు చేశారు.
కొడుకును పట్టించుకోలేదా?: కొడుకు యశవర్ధన్ సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తుంటే, గోవిందా కనీసం సాయం చేయడం లేదని ఆమె మండిపడ్డారు.
మొహం మీదే ప్రశ్న: “నువ్వు అసలు తండ్రివేనా కాదా?” అని గోవిందాను నిలదీసినట్లు ఆమె చెప్పుకొచ్చారు.
పిల్లల బాధ్యత: “నీకు ఇప్పుడు 63 ఏళ్లు. కూతురు టీనాకు పెళ్లి చేయాలి, కొడుకు కెరీర్ సెట్ చేయాలి.. ఇంకా ఈ ఎఫైర్లు ఏంటి?” అని సునీత క్లాస్ పీకినట్టు సమాచారం.
ఆ మరాఠీ నటితో ఎఫైర్ నిజమేనా?
గతంలో గోవిందా ఒక మరాఠీ నటితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని, సునీతకు విడాకులు ఇవ్వబోతున్నారని ముంబై సర్కిల్స్‌లో గట్టిగా వినిపించింది. అయితే అప్పట్లో లాయర్ల ద్వారా ఆ వార్తలను ఖండించినా, ఇప్పుడు సునీత మాటలు చూస్తుంటే నిప్పు లేనిదే పొగ రాదనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. 39 ఏళ్ల వీరి వైవాహిక బంధం ఇప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
