ప్రీతి జింతా… ఒక్కప్పుడు వెండితెరపై అందం, అభినయం, అల్లరిచేసే పాత్రలతో కుర్రకారుని ఆకట్టుకుని దుమ్ము రేపింది. తెలుగులో సైతం మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్స్ సరసన నటించి అదరకొట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు సినిమాలు తగ్గించేసింది. మరేం చేస్తోంది.. ఈ డింకచికా బ్యూటీ… ఇప్పుడు ఐపీఎల్ మైదానాల్లో తిరుగులేని ఫ్యాన్ గాళ్‌గా మారిపోయింది! ఈ క్రమంలో ఆమె ఆస్దులు, వ్యాపారాలు,సంపాదనలు లెక్కలు చూద్దాం.

పంజాబ్ కింగ్స్ జట్టు 2025 ఐపీఎల్ ఫైనల్‌కి చేరిన తర్వాత, మళ్లీ ప్రీతి జింతా ట్రెండ్‌లోకి వచ్చేసింది. ప్రతి మ్యాచ్‌లో కనిపిస్తూ, సంతోషం, ఎమోషన్, టీమ్ స్పిరిట్‌తో నిండిన ఆమె రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటిగా మాత్రమే కాకుండా, ఓ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌వుమన్‌గా ప్రీతి తనదైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు చూద్దాం ప్రీతి జింతా లగ్జరీ లైఫ్‌స్టైల్, 2025 నెట్‌వర్త్, ఆదాయ వివరాలు: 2025లో ప్రీతి జింతా నెట్‌వర్త్ అంచనా రూ. 183 కోట్లు. ఆమె సంపాదనలో భాగంగా:
సినిమా పారితోషికాలు
బ్రాండ్ ప్రమోషన్లు
ఐపీఎల్ జట్టు వాటా
ఇతర బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్నాయి.

ఒక బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌కు ప్రీతి జింతా రూ. 1.5 నుండి 2 కోట్లు వరకు తీసుకుంటారు. తాజా సినిమా ‘లాహోర్ 1947’ కోసం ఆమెకు రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది.

పంజాబ్ కింగ్స్‌పై ఆమె పెట్టుబడి
2008లో ప్రీతి జింతా రూ. 35 కోట్లు పెట్టుబడి పెట్టి పంజాబ్ కింగ్స్ కో-ఓనర్‌గా మారింది. ఇప్పుడు ఆ వాటా విలువ దాదాపు రూ. 350 కోట్లుకు చేరింది! ఈ జట్టు మొత్తం విలువ 76 మిలియన్ డాలర్ల నుంచి 925 మిలియన్ డాలర్లకు పెరగడం ప్రీతి తీసుకున్న వ్యాపార నిర్ణయాల తెలివితేటలకు నిదర్శనం.

లగ్జరీ లైఫ్‌స్టైల్ ….ప్రీతి జింతా జీవితం నిజంగా రాజసంగా గడుస్తోంది.
ముంబై పాలి హిల్‌లో విలాసవంతమైన రూ. 17 కోట్లు విలువ చేసే అపార్ట్‌మెంట్

హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో రూ. 7 కోట్లు విలువ చేసే ఇల్లు
మ్యారేజ్ తర్వాత భర్త జీన్ గుడ్‌ఇనఫ్‌తో కలసి లాస్ ఏంజెల్స్‌లో బివర్లీ హిల్స్ అనే హై క్లాస్ ఏరియాలో నివాసం

ప్రీతి కార్ల పట్ల బాగా ఆసక్తి చూపుతుంది. ఆమె కలెక్షన్‌లో:
Lexus LX 470
Porsche
BMW
Mercedes-Benz E-Class ఉన్నాయి.

ప్రీతి రీ ఎంట్రీ: లాహోర్ 1947
సుదీర్ఘ విరామం తర్వాత ప్రీతి జింతా ‘లాహోర్ 1947’ చిత్రంతో బాలీవుడ్‌కి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వనుంది.
దర్శకత్వం: రాజ్‌కుమార్ సంతోషి
నిర్మాత: ఆమిర్ ఖాన్
ఇతర నటులు: సన్నీ డియోల్, షిల్పా శెట్టి, అలీ ఫజల్, షబానా ఆజ్మీ
పార్టిషన్ నేపథ్యంలోని ఈ డ్రామా ప్రీతి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతోంది.
ఇంకా ఏం చేస్తోంది?

ప్రీతి తన ప్రొడక్షన్ కంపెనీని నడుపుతోంది. ఫిట్‌నెస్ బిజినెస్‌లో కూడా ఇన్వెస్ట్ చేసింది. సినిమాలకు దూరంగా ఉన్నా, ఆమె ఎప్పుడూ ప్రొఫెషనల్‌గా యాక్టివ్‌గా ఉంది.

ప్రీతి జింతా ఒక రకంగా ఫిల్మ్ స్టార్లకు మార్గదర్శిగా నిలుస్తోంది – అందంతో పాటు విజ్ఞానం, కెరీర్‌తో పాటు క్షమత, ఐడెంటిటీతో పాటు ఇంటెలిజెన్స్ ఉన్న అరుదైన వ్యక్తిత్వం!

ఈ సీజన్ పంజాబ్ కింగ్స్ విజయం సాధించకపోయినా, ప్రీతి జింతా గెలిచిన వ్యక్తిగత గౌరవం మాత్రం అమూల్యం!.ప్రీతి జింతా సాదా అందంతోనే కాదు, తన స్పిరిట్, స్ట్రాంగ్ వ్యక్తిత్వంతో కూడా అభిమానుల మనసుల్ని గెలుచుకుంది. ఆమె సినిమాలో చూపించిన నటనతో పాటు, బిజినెస్ రంగంలో చూపిన తెలివితేట కూడా అదుర్స్!