
నందిపై త్రిశూలంతో మహేష్-గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ షాక్ ! టైటిల్ రివీల్
సినీ అభిమానులు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది… రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ రాత్రి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది! లక్షల్లో ఫ్యాన్స్ హాజరైన గ్లోబ్‌ట్రాట్టర్ మెగా ఈవెంట్ లో చివరకు మహేష్–రాజమౌళి సినిమా టైటిల్‌ను అధికారికంగా లాక్ చేశారు. అందరి ఊహాగానాలకు ఎండ్ కార్డు పెడుతూ… టైటిల్ ‘వారణాసి’ అని తేల్చారు!
ఈ టైటిల్‌తో పాటు చూపించిన ఫస్ట్ గ్లింప్స్ మాత్రం నెక్ట్స్ లెవెల్… నిజంగా నెవర్ బిఫోర్ – నెవర్ అగైన్. నంది మీద త్రిశూలం పట్టుకుని అడుగు వేసిన మహేష్ బాబు లుక్… గూస్బంప్స్ పీక్కు తీసుకెళ్లింది. రాజమౌళి మహేష్‌ను ఇంత రగ్డ్గా, ఇంత మైథాలజికల్–అడ్వెంచరస్ టోన్‌లో చూపిస్తారని ఎవరూ ఊహించలేదు!
వరుణాసి—ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్‌ని కె.ఎల్. నారాయణ ఆల్‌టైమ్ రికార్డ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సంగీతం, BGM కి ఎం.ఎం. కీరవాణి ప్రాణం పోస్తున్నారు.
2027లో వరల్డ్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తూ… ఫుల్ టీమ్ గ్లోబ్‌ట్రాట్టర్ ఈవెంట్ లో హాజరై ఈ టైటిల్ లాంచ్ ను గ్లోబల్ రేంజ్ ఫెస్టివల్ లా మార్చేశారు.
టైటిల్ వచ్చేసింది… గ్లింప్స్ దుమ్ము లేపేసింది… ఇక ట్రైలర్ వచ్చేప్పుడో ఊపిరి బిగపట్టుకుని వేచి చూడాల్సిందే!
