
మణిరత్నం మళ్లీ లవ్ స్టోరీతో, హీరో,హీరోయిన్స్ ఎవరంటే…?
“మణిరత్నం” అనే పేరు వినగానే మనకి గుర్తొచ్చేది… స్లో మోషన్ లవ్, ఓ మెల్లని మెలోడీ, ఇరువైపులా మబ్బులు… కళ్లతో మాట్లాడే ప్రేమ!
అవును…
సినిమా ప్రేక్షకులు మళ్లీ అదే మేజిక్ కోసం ఎదురు చూస్తున్నారు. Ponniyin Selvan బాగానే ఆడినా, Thug Life మాత్రం భారీ నిరాశే.
అయితే… మణిరత్నం తగ్గేదేలే అన్నట్లు తన కొత్త సినిమా మొదలెట్టేసారు!
ఎవరు హీరో, ఎవరు హీరోయిన్?
తాజా సమాచారం ప్రకారం… మణిరత్నం తిరిగి ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరింత ఆసక్తికరమైన విషయం?
హీరో – విజయ్ సేతుపతి
హీరోయిన్ – సాయి పల్లవి
ఇద్దరూ… సాధారణంగా ఏ కమర్షియల్ ఫిల్మ్‌ను పట్టించుకోరు. అందుకే, ఈ కాంబినేషన్ వినగానే సినీ వర్గాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి!
మణిరత్నం స్క్రిప్ట్ ఫైనల్ టచ్‌లు ఇస్తున్నాడట. విజయ్ + సాయి పల్లవి = సగం పని అయిపోయినట్టే!
ఇప్పుడేం జరగబోతోంది?
ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, సమాచారం స్పష్టంగా ఉంది — అనౌన్స్‌మెంట్ చాలా త్వరలో!
ఈ సినిమా… సాధారణ ప్రేమకథ కాదు. మణిరత్నం తన స్టైల్లో ఇంటెన్స్ ఎమోషన్, క్లాసిక్ విజువల్స్, మ్యూజిక్‌తో మైండ్‌బ్లోయింగ్ జర్నీ ఇవ్వబోతున్నాడు.
“మణిరత్నం – విజయ్ సేతుపతి – సాయి పల్లవి” ఈ లైన్ ఒక్కటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటిని ఫుల్ రెయింజ్‌లో పెంచేసింది!
