సినిమా వార్తలు

విజయ్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘జన నాయగన్’ రిలీజ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు! ప్లాన్ మొత్తం రివర్స్?

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ చుట్టూ ఉత్కంఠ వీడటం లేదు. జనవరి 9న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా, సెన్సార్ వివాదాల వల్ల కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా భవితవ్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురు!

సినిమా విడుదలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేలా సీబీఎఫ్‌సీని ఆదేశించాలని కోరుతూ నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. “ఈ విషయంలో మేము నేరుగా జోక్యం చేసుకోలేము, మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌నే సంప్రదించండి” అని స్పష్టం చేసింది.

మరో వారం ఎదురుచూపులే.. 20వ తేదీన అసలు విషయం!

నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. సినిమా వాయిదా పడటం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతోందని, అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. మద్రాస్ హైకోర్టు ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అంటే, కనీసం ఈ నెల 20 వరకు సినిమా విడుదలపై ఎటువంటి క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

వివాదం ఏంటి?

సినిమాలో కొన్ని సన్నివేశాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, సాయుధ దళాలను తప్పుగా చూపించారనే ఆరోపణలతో సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి పంపింది. అయితే, సింగిల్ జడ్జి సినిమాకు క్లియరెన్స్ ఇచ్చినా.. డివిజన్ బెంచ్ దానిపై స్టే విధించింది. ఇది విజయ్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

Similar Posts