సినిమా వార్తలు

500 కోట్ల హిట్ సినిమాలో ఘోర తప్పిదం! ‘ధురంధర్ 2’లో అద్దంలో కనిపించిన ఆ వ్యక్తి ఎవరు?!

బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టిస్తున్న సినిమాలో, ఎవరూ ఊహించని ఒక షాకింగ్ మిస్టేక్ బయటపడింది. అది చూసిన ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ఒకప్పుడు సినిమా అంటే కేవలం వెండితెరపై చూసి ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది, సోషల్ మీడియా పుణ్యమా అని ప్రేక్షకులు ప్రతి సీన్‌ను బూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఎంత పెద్ద దర్శకుడైనా, ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా సరే.. చిన్న పొరపాటు దొర్లితే చాలు సెకన్లలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతోంది. తాజాగా బాలీవుడ్ సెన్సేషన్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’లో అలాంటి ఒక చిత్రమైన పొరపాటును నెటిజన్లు పట్టుకున్నారు.

అద్దంలో దొరికిపోయిన అదిత్య ధర్ టీమ్:

డైరెక్టర్ అదిత్య ధర్ అంటేనే ‘పీక్ డీటెయిలింగ్’కు కేరాఫ్ అడ్రస్. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో శ్రద్ధగా మలిచే ఆయన సినిమాలో ఈ పొరపాటు జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమాలో ఒక కీలకమైన బాత్రూమ్ ఫైట్ సీన్ జరుగుతున్నప్పుడు, కెమెరా యాంగిల్ మారిన క్రమంలో అక్కడ ఉన్న అద్దంలో కెమెరామన్ ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. కెమెరా పట్టుకుని ఉన్న ఆ వ్యక్తిని గుర్తుపట్టిన నెటిజన్లు, ఆ క్లిప్‌ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.

ట్రోలర్స్ మామూలుగా లేరుగా:

“అదిత్య ధర్ డీటెయిలింగ్ అంటే ఇదేనా? కెమెరామన్‌ను కూడా సినిమాలో భాగం చేయడం పీక్ డీటెయిలింగ్ కిందకు వస్తుందా?” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఈ తప్పును సమర్థిస్తూ, గతంలో హాలీవుడ్ దిగ్గజం క్రిస్టోఫర్ నోలన్ సినిమాల్లో కూడా ఇలాంటి పొరపాట్లు జరిగాయని ఉదాహరణలు ఇస్తున్నారు. ఏదేమైనా ఈ ఒక్క సీన్ వల్ల సినిమాకు వస్తున్న క్రేజ్ తగ్గకపోగా, ఆన్‌లైన్‌లో మరింత బజ్ క్రియేట్ అయ్యింది.

రికార్డుల సునామీ:

మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.501 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రణ్‌వీర్ సింగ్ యాక్షన్ పర్‌ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ చిన్న పొరపాటు దర్శకుడు అదిత్య ధర్ దృష్టికి వెళ్ళిందా లేదా అనేది ఇంకా తెలియదు గానీ, నెటిజన్లు మాత్రం ఈ సీన్‌ను ఇంటర్నెట్‌లో తెగ షేర్ చేస్తున్నారు.

Similar Posts