
మహేష్ బాబు అంత వైల్డ్ గానా, హాట్ సీన్స్ కూడా ఉంటాయా ?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త ఇది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ తో బిజీగా ఉన్న మహేష్, తన తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడనే సస్పెన్స్‌కు తెరపడినట్లే కనిపిస్తోంది. టాలీవుడ్ సెన్సేషన్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో మహేష్ బాబు సినిమా దాదాపు ఖరారైపోయినట్లు తెలుస్తోంది. ఈ మెగా ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ సతీమణి నమ్రత శిరోద్కర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, ఇప్పటికే స్క్రిప్ట్ చర్చలు కూడా ముగిశాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
సందీప్ వంగా ‘వైల్డ్’ కథ.. మహేష్ ‘క్లాస్’ లుక్!
సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో హీరోలను అత్యంత ఊరమాస్ గా, వైల్డ్ గా చూపిస్తారు. మరి మహేష్ బాబు లాంటి క్లాస్ హీరోను సందీప్ తన స్టైల్ లో ఎలా చూపిస్తాడో అన్న ఆసక్తి కుర్రాళ్లలో పిచ్చెక్కిస్తోంది.
నమ్రత వేలు పెట్టిందా?: స్క్రిప్ట్ విషయంలో నమ్రత కొన్ని మార్పులు చేర్పులు సూచించారని, సందీప్ వంగా కూడా మహేష్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఆ మార్పులు చేశారని సమాచారం.
కథ ఫిక్స్: ఇప్పటికే సందీప్ ఒక పవర్‌ఫుల్ లైన్ వినిపించగా, మహేష్ బాబు దానికి పూర్తిగా ఇంప్రెస్ అయ్యి ‘ఓకే’ చెప్పేశారట. వారణాసి షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
‘స్పిరిట్’ తర్వాత ‘సూపర్ స్టార్’ సినిమానే!
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే, మహేష్ బాబు-రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యే టైమ్‌కి ఈ కాంబో సెట్స్ పైకి వెళ్తుందని అంచనా. ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఒకవేళ సందీప్ మార్క్ వైలెన్స్ మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్‌కు తోడైతే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్ధలైపోవడం ఖాయం.
రాజమౌళితో గ్లోబల్ రేంజ్ హిట్ కొట్టాక, సందీప్ వంగాతో మహేష్ బాబు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ కాంబినేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా కిక్కిచ్చే వార్త. మరి ఈ ‘వైల్డ్ రైడ్’ ఎప్పుడు మొదలవుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే!
