సినిమా వార్తలు

నరేష్ ‘హగ్’ గోల! హీరోయిన్ చీర కట్టుకుంది కాబట్టే ఆగిపోయానంటూ షాకింగ్ వ్యాఖ్యలు.. శివాజీకి కౌంటరా?

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ (Naresh) ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆయన నటించిన ‘హే భగవాన్’ (Hey Bhagwan) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నరేష్ చేసిన పనులు, మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. హీరోయిన్‌ను కౌగిలించుకోబోయి.. చివరి నిమిషంలో మనసు మార్చుకున్న నరేష్, దాని వెనుక ఉన్న కారణాన్ని చెప్తూ శివాజీ వివాదాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చారు.

హగ్ డే.. కానీ ఆమెకు మాత్రం నో!

ట్రైలర్ లాంచ్ జరిగిన రోజు ‘హగ్ డే’ కావడంతో నరేష్ స్టేజ్ మీద ఉన్న మగాళ్లందరినీ సరదాగా హత్తుకున్నారు. అయితే, వంతు హీరోయిన్ శివాని నగరం (Shivani Nagaram) మరియు యాంకర్ స్రవంతి దగ్గరకు వచ్చేసరికి నరేష్ ఒక్కసారిగా ఆగిపోయారు. “మీ ఇద్దరినీ కూడా హగ్ చేసుకుందామని అనుకున్నాను.. కానీ మీరు చీరలు కట్టుకుని వచ్చారు. అందుకే ఆగిపోయాను” అంటూ నరేష్ బాంబు పేల్చారు.

శివాజీ వివాదాన్ని గుర్తు చేస్తూ..

గతంలో ‘దండోరా’ ఈవెంట్‌లో నటుడు శివాజీ మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. చీర కట్టుకుంటేనే గౌరవం ఉంటుందని ఆయన అన్న మాటలపై చిన్మయి, అనసూయ లాంటి వారు ఫైర్ అయ్యారు. ఇప్పుడు నరేష్ అదే పాయింట్‌ను టచ్ చేస్తూ.. “ఈ మధ్య జరిగిన ఒక సంఘటన తర్వాత అమ్మాయిలంతా ఈవెంట్లకు చీరల్లోనే వస్తున్నారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చీర కట్టుకున్న మహిళలను హగ్ చేసుకోవడం పద్ధతి కాదు. అందుకే నేను కంట్రోల్ చేసుకున్నాను” అని సెటైరికల్‌గా మాట్లాడారు.

మీరే హగ్ చేసుకోండి!

అక్కడితో ఆగకుండా, “నేను హగ్ చేసుకోను కానీ.. మీరిద్దరూ (శివాని, స్రవంతి) ఒకరినొకరు కౌగిలించుకోండి” అని నరేష్ చెప్పడంతో వారు అలాగే చేశారు. శివాజీ పేరు ఎత్తకపోయినా, నరేష్ మాటలన్నీ ఆయన ఉద్దేశించి చేసినవేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మొత్తానికి పాత వివాదాన్ని మళ్ళీ తవ్వి తీసి నరేష్ కొత్త రచ్చకు తెరలేపారు.

Similar Posts