ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన నటనకు తెలంగాణ ప్రభుత్వంగా గద్దర్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన పుష్పా 2 చిత్రం దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్లో విడుదలై, దేశవ్యాప్తంగా ₹1800 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డులు తిరగరాసింది.
ఇప్పుడు అదే సినిమా హిందీలో TRP రేటింగ్స్ పరంగా మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
OTTలో ఉన్నా… టీవీలో పుష్పాకు పీక్స్ వ్యూవర్షిప్!
థియేటర్లో విడుదలైన కొద్ది రోజులకే OTTలో స్ట్రీమింగ్కి వచ్చినప్పటికీ, పెద్దసంఖ్యలో ప్రేక్షకులు టెలివిజన్‌లో పుష్పా 2ను వీక్షించారు. తాజాగా హిందీ వెర్షన్ టీవీ ప్రీమియర్ కాగా, అది 5.1 TVR రేటింగ్ సాధించి, ఏకంగా 5.4 కోట్ల మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ రేటింగ్… బాలీవుడ్‌లోని పెద్ద స్టార్ల సినిమాలు అయిన పఠాన్ (షారుఖ్ ఖాన్), యానిమల్ (రణబీర్ కపూర్) వంటి సినిమాల TRP రికార్డులను దాటి వెళ్లింది. ఇది పుష్పా రాజ్ నార్త్ ఇండియాలోని డామినేషన్‌కు స్పష్టమైన నిదర్శనం.
IPL ని కూడా ఓవర్టేక్ చేసిన పుష్పా 2!
ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే – ఈ TRP ఫీట్ IPL సీజన్ పీక్ టైమ్‌లో వచ్చిందని! అంటే క్రికెట్‌ను మించిన వ్యూయర్ షిప్‌తో పుష్పా 2 మరోసారి తన అగ్రస్థానాన్ని రుజువు చేసుకున్నాడు. ఇది దక్షిణాది హీరోగా ఉత్తర భారతాన్ని ఓవర్టేక్ చేసిన అరుదైన ఘనత.
అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ నెక్స్ట్ బ్లాక్‌బస్టర్!
ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ త్వరలో అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఈ కాంబినేషన్ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు పుష్పా క్రేజ్ తో పాటు మరింత హైప్ కూడా దక్కనుంది.
తెలుగు హీరో… ఉత్తర భారత్‌లో బాలీవుడ్ స్టార్లను దాటి, IPLను మించిన TRP రికార్డులు నమోదు చేయడం… ఇది పుష్పా రాజ్ స్టైల్!