మంగళవారం ఉదయం ముంబయిలోని తన జిమ్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో సమంత రూత్ ప్రభు ఓ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఫోటోగ్రాఫర్లు అనూహ్యంగా తాలూకు దగ్గరికి వచ్చేయడంతో, సమంత ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

“స్టాప్ ఇట్ గైస్ ప్లీజ్…” – అసహనంగా సమంత

అప్పుడు సమంత ఫోన్‌లో మాట్లాడుతుండగా, బ్రౌన్ అథ్లెటిక్ వేర్ (ట్రాక్ ప్యాంట్స్, స్పోర్ట్స్ బ్రా) లో కనిపించారు. ఈ లోపలే ఫోటోగ్రాఫర్లు ఒక్కసారిగా ఎగబడటంతో ఆమె అసౌకర్యంగా ఫీలయ్యారు. వెంటనే కార్ వైపు పరుగెత్తారు. “స్టాప్ ఇట్ గైస్ ప్లీజ్…” అంటూ అసహనంగా కోరారు. తమ పర్సనల్ స్పేస్ భంగం అవుతోందని ఆమెలో స్పష్టంగా కనిపించింది.

అయితే, అనంతరం కొద్దిసేపటికే సమంత చల్లబడిపోయి, ఫోటోగ్రాఫర్లకు సారీ చెప్పారు. “ప్లీజ్ మళ్ళీ రికార్డ్ చేయొద్దు…” అంటూ వినమ్రంగా కోరారు.

నెటిజెన్ల మద్దతు – “సమంతకు కూడా ప్రైవేట్ స్పేస్ కావాలి”

ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరైతే సెలబ్రిటీలకు పాపారాజీ వస్తూనే ఉంటుందని, సమంత రియాక్షన్ ఓవర్ అయిందని అంటున్నారు. కానీ మరికొంతమంది మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తూ, “సమంత అసహనం చూపడమే అరుదు… అది కూడా విపరీతంగా ట్రిగర్ అయిందంటే, ఏదో బాగా డిస్ట్రబ్ చేసినట్టే” అని కామెంట్లు పెడుతున్నారు.

“స్టార్స్ అన్నవాళ్లకీ మూడ్స్ ఉంటాయి. ప్రతిరోజూ చిరునవ్వుతో ఉండలేరు. ప్రతి సారీ ఫొటోలకు పోజులివ్వలేరు. కొంత ప్రైవసీ ఇవ్వాలి…” అనే ఆలోచన కూడా అభిమానుల నుండి బలంగా వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండగా, సమంత ప్రొడ్యూస్ చేసిన తొలి సినిమా ‘శుభం’ — ఓ రూరల్ హారర్ కామెడీ — ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

,
You may also like
Latest Posts from