ఒక టైమ్ లో టాలీవుడ్‌లో ఏ సినిమా చూసినా ఆమెనే కనిపించేది.. స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల చేతిలో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదన్న వార్త ఇండస్ట్రీలో కార్చిచ్చులా వ్యాపిస్తోంది!
అందానికి అందం, అంతకు మించి అదరగొట్టే డ్యాన్స్ స్కిల్స్‌తో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన శ్రీలీల కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడిందా? వేగంగా ఎదిగిన అంతే వేగంగా కిందకు పడిపోతోందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. గత కొన్ని నెలలుగా ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటమే కాకుండా, ఆమె చేసిన పాత్రలపై కూడా తీవ్ర విమర్శలు రావడంతో టాలీవుడ్ మేకర్స్ శ్రీలీలకు హ్యాండ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

శ్రీలీల గత ఏడాది వరకు టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే ‘పెళ్లి సందD’, ‘ధమాకా’ వంటి హిట్ల తర్వాత ఆమె చేసిన సెలక్షన్స్ అన్నీ బెడిసికొట్టాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి బిగ్ స్టార్‌తో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంచనాలను అందుకోలేకపోవడం, వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ వల్ల వచ్చిన ట్రోలింగ్ ఆమె ఇమేజ్‌ను దెబ్బతీశాయి. ఇక తమిళంలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామని చేసిన ‘పరాశక్తి’ (2026) కూడా డిజాస్టర్‌గా మిగలడంతో సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు గడ్డుకాలం మొదలైంది.
ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రాకపోవడంతో, ఈ అమ్మడు తన మకాంను బాలీవుడ్‌కు మార్చేసింది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన ఒక మ్యూజికల్ ఫిల్మ్‌లో నటిస్తోంది. అలాగే ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి మరో ప్రాజెక్ట్ చేస్తూ హిందీలో నిలదొక్కుకోవాలని చూస్తోంది. ‘భగవంత్ కేసరి’, ‘గుంటూరు కారం’, ‘మాస్ జాతర’ వంటి వరుస సినిమాలు అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాకపోవటం ఆమెను టాలీవుడ్‌కు దూరం చేశాయన్నది కాదనలేని వాస్తవం.

వరుస ఫ్లాపులు ఎదురైనప్పుడు ఏ హీరోయిన్‌కైనా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం సహజమే. మరి బాలీవుడ్‌లోనైనా శ్రీలీల తన అదృష్టాన్ని పరీక్షించుకుని మళ్ళీ టాలీవుడ్‌లోకి గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. శ్రీలీల మళ్ళీ ఫామ్ లోకి రావాలని మీరు కోరుకుంటున్నారా? కామెంట్స్ లో తెలపండి!

