సినిమా వార్తలు

శ్రీముఖితో ఎఫైర్ రూమర్లపై ఆర్జే చైతూ షాకింగ్ కామెంట్స్.. ‘ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే’ అంటూ సెన్సేషన్!

హైదరాబాద్: బుల్లితెర రాములమ్మ శ్రీముఖి (Sreemukhi) ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుంది. అయితే ఆమె పక్కన ఏ హీరో లేదా యాంకర్ కనిపించినా.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొస్తుంటాయి. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్, పాపులర్ ఆర్జే చైతూ (RJ Chaitu) శ్రీముఖితో తనకున్న అనుబంధంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు వారి మధ్య ఉన్నది ప్రేమా? స్నేహమా? అనే విషయంపై చైతూ పబ్లిక్‌గా క్లారిటీ ఇచ్చేశారు.

ఆ చాటింగ్‌తోనే మొదలైంది..!

ఐడ్రీమ్ (iDream) ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్‌లోని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. శ్రీముఖితో పరిచయం ఎలా ఏర్పడిందో చెబుతూ.. “చోటా స్క్రీన్ బడా స్టార్” అనే రేడియో షో కోసం ఆమెను మొదటిసారి కలిశానని గుర్తు చేసుకున్నారు. అప్పటికి శ్రీముఖి ‘సూపర్ సింగర్’ యాంకర్‌గా బిజీగా ఉన్నారు. ఆ పరిచయం కాస్తా సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకునే వరకు వెళ్లిందని, అలా తామిద్దరం బాగా దగ్గరయ్యామని చైతూ వెల్లడించారు.

కలిసి భోజనం.. కంటిన్యూస్‌గా ఫోన్ కాల్స్!

‘కెవ్వు కబడ్డీ’ షో సమయంలో వీరిద్దరి ప్రయాణం మరింత బలపడింది. “షూటింగ్ గ్యాప్‌లో కలిసి భోజనం చేయడం, ఒకే రకమైన ఆలోచనలు ఉండటంతో మా మధ్య స్నేహం బలపడింది. నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు సెలబ్రిటీలే ఫ్రెండ్స్ ఉంటారు. నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితే సాఫ్ట్‌వేర్ వాళ్లే ఫ్రెండ్స్ అయ్యేవారు కదా” అంటూ రూమర్ల రాయుళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు చైతూ.

అవినాష్‌తో స్నేహం వెనుక అసలు కథ!

జబర్దస్త్ అవినాష్ (Jabardasth Avinash) గురించి కూడా చైతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. అవినాష్ జబర్దస్త్‌లోకి రాకముందే రేడియో టాలెంట్ షో ద్వారా తనకు పరిచయమని, ఆ పోటీలో అవినాష్ విన్నర్ అని తెలిపారు. శ్రీముఖి, అవినాష్, తాను.. ఈ ముగ్గురం కలిస్తే వచ్చే ఆ కిక్కే వేరని, తమది చాలా స్వచ్ఛమైన స్నేహమని స్పష్టం చేశారు.

బాధ కలిగించిన రూమర్లు!

శ్రీముఖితో తనను లింక్ చేస్తూ వచ్చిన వార్తలు తనను చాలా బాధించాయని చైతూ ఆవేదన వ్యక్తం చేశారు. “ఎదుటివారు ఇచ్చే గౌరవాన్ని బట్టే నా రియాక్షన్ ఉంటుంది. మా మధ్య ఉన్నది కేవలం గౌరవం, స్నేహం మాత్రమే. అంతకు మించి ఏమీ లేదు” అని క్లియర్ కట్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.

మొత్తానికి శ్రీముఖి కౌగిలిలో ఆ నటుడు.. నీతో తనివి తీరదు అంటూ వస్తున్న బోల్డ్ కామెంట్స్‌కు, రూమర్లకు చైతూ తనదైన శైలిలో ఫుల్‌స్టాప్ పెట్టారు.

Similar Posts