Gadar 2 సూపర్ హిట్ కావ‌డంతో స‌న్నీ డియోల్ మళ్లీ యాక్ష‌న్ సినిమాల వైపు మొగ్గుచూపారు. అదే జోష్‌లో ఆయన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ డ్రామా ‘జాట్’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ ప్రాజెక్ట్‌ను జీ స్టూడియోస్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. ఇది మైత్రీ వారి తొలి హిందీ సినిమా కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్ హీరోయిన్లు కాగా, రణదీప్ హుడా, జగపతిబాబు, రమ్యకృష్ణ, జరీనా వాహెబ్, రవిశంకర్, అజయ్ ఘోష్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన జాట్, భారీ ప్రచారం జరిగినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.119 కోట్లు మాత్రమే రాబట్టి యావరేజ్‌ గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినప్పటికీ మైత్రీ ఆశించిన స్థాయిలో లాభాలు రాబట్టలేకపోయింది. అయితే నష్టాల్లోకి వెళ్లలేదు కూడా. కొద్దిపాటి ఊపిరి తీసుకునే అవకాశం మాత్రం మిగిలింది.

ఇదిలా ఉంటే, ఈ చిత్రం ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది. థియేటర్లలో మిస్ చేసిన వారు ఇప్పుడు ఓటీటీలో చూడటం మొదలెట్టారు.

నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చినప్పటి నుండి “జాట్”కు అపారమైన స్పందన లభిస్తోంది. ఇప్పుడు వరుసగా మూడో వారం కూడా నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లీష్ సినిమాల్లో టాప్ 10లో నిలిచింది. చాలా దేశాల్లో ఈ సినిమా టాప్ ట్రెండింగ్‌ పొజిషన్‌లో ఉంది.

నెట్‌ఫ్లిక్స్ వ్యూస్ (Jaat Movie):

1వ వారం: 4.1 మిలియన్ వ్యూస్

2వ వారం: 3.8 మిలియన్ వ్యూస్

3వ వారం: 1.5 మిలియన్ వ్యూస్

మొత్తంగా ఈ మూడువారాల్లో 9.4 మిలియన్ వ్యూస్ సాధించి, సన్నీ డియోల్‌కి ఓ సరికొత్త డిజిటల్ హిట్ తీసుకొచ్చింది. థియేటర్స్‌లో తక్కువ వసూళ్లు వచ్చినా, ఓటీటీ వేదికపై ఈ సినిమా ఘన విజయం సాధించడంతో గోపీచంద్ మలినేని హిందీలో తనకు ఒక స్థానం సంపాదించుకున్నట్టు అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

, , ,
You may also like
Latest Posts from