సినిమా వార్తలు

“ప్యాడెడ్ బ్రాలు వేసుకోమని ఫోర్స్ చేశారు”.. సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ ‘వైల్డ్’ కామెంట్స్ !

సౌత్ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి, ఇక్కడ స్టార్ డమ్ వచ్చాక బాలీవుడ్ కి చెక్కేసిన తాప్సీ పన్ను.. మరోసారి తన ‘నోటికి’ పని చెప్పింది! ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఈ అమ్మడు, ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో మంటలు రేపుతున్నాయి. గ్లామర్ సీన్ల పేరుతో తనను ఎంతలా ‘హ్యుమిలియేట్’ చేశారో చెప్తూ తాప్సీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే?

“అందరూ అక్కడే చూసేవాళ్లు!” – తాప్సీ ఘాటు వ్యాఖ్యలు

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాప్సీ తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది. “సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ సీన్లు, పాటల కోసం మమ్మల్ని ప్యాడెడ్ బ్రాలు వేసుకోమని బలవంతం చేసేవాళ్లు. ఆ బ్రాలు వేసుకుంటే తేడా క్లియర్ గా తెలిసిపోయేది. షూటింగ్ స్పాట్‌లో అందరూ అక్కడే (ఛాతిపైనే) చూస్తూ ఉండేవాళ్లు. అది నాకు చాలా అసౌకర్యంగా, అవమానకరంగా అనిపించేది” అంటూ బాంబు పేల్చింది. ఈ కామెంట్స్ విన్న మన కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయిపోవడమే కాదు, సౌత్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ లో ఉన్నారు.

అవసరానికి వాడుకుని.. ఇప్పుడు ఆరోపణలా?

తాప్సీ ఇలా సౌత్ సినిమాను తక్కువ చేసి మాట్లాడటం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ రాఘవేంద్ర రావు గారి బొడ్డు మీద కొబ్బరికాయ సీన్ గురించి కూడా ఇలాగే వెటకారంగా మాట్లాడింది. దీంతో నెటిజన్లు తాప్సీని ఏకిపారేస్తున్నారు. “అప్పుడు సినిమాలు లేనప్పుడు అన్నీ చేసి.. ఇప్పుడు హిట్లు వచ్చాక ఇండస్ట్రీని తిడతావా?” అంటూ నెటిజన్లు చుక్కలు చూపిస్తున్నారు. అంతేకాదు, “బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్, నెపోటిజం గురించి ఎందుకు మాట్లాడవు? కేవలం సౌత్ ఇండస్ట్రీ అంటేనే నీకు చులకనా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

టైమింగ్ మీదే డౌట్స్!

సౌత్ లో ఎంతో మంది హీరోయిన్లు సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కొనసాగిస్తుంటే, తాప్సీకి మాత్రమే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారు. ఆ సమయంలో అభ్యంతరం చెప్పకుండా, ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు తగ్గుతున్న టైంలో ఇలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం పక్కా ‘అటెన్షన్ సీకింగ్’ అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

తాప్సీ చెప్పింది నిజంగా ఆమె ఎదుర్కొన్న బాధా? లేక కావాలనే సౌత్ సినిమాను బ్యాడ్ చేయడానికి చేస్తున్న స్కెచ్చా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఏదేమైనా తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం తాప్సీకి అలవాటుగా మారిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తాప్సీ చేసిన ఈ ‘ప్యాడెడ్ బ్రా’ కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? ఆమె చెప్పింది కరెక్టేనా? లేక ఫ్యాన్స్ ఇస్తున్న కౌంటర్లకు మీ ఓటా? కింద కామెంట్ సెక్షన్‌లో రియాక్షన్స్ ఇచ్చేయండి!

Similar Posts