
మెగాస్టార్ ‘హుక్‌స్టెప్’ వెనుక షాకింగ్ సీక్రెట్: EMI రికవరీ ఫోన్ కాల్స్ వల్లే పుట్టిందట!!
బాక్సాఫీస్ దగ్గర ‘మన శంకర వరప్రసాద్ గారు’ మాస్ జాతర మొదలైంది. థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి తోడు, చిరు వేసిన ‘హుక్‌స్టెప్’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఈ స్టెప్పును రీల్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అయితే, ఈ వైరల్ స్టెప్ వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు!
EMI కాల్స్ తెచ్చిన ఐడియా!
సాధారణంగా కొరియోగ్రాఫర్స్ ఏదైనా కొత్త స్టెప్ కోసం రోజుల తరబడి కష్టపడుతుంటారు. కానీ, ఈ సాంగ్ హుక్‌స్టెప్ మాత్రం ‘ఈఎంఐ (EMI)’ టెన్షన్లో పుట్టిందట. ఈ ఆసక్తికర విషయాన్ని కొరియోగ్రాఫర్ ‘ఆట’ సందీప్ స్వయంగా వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..?
“మనుషులన్నాక సమస్యలు ఉండటం సహజం. ఆ రోజు నేను సాంగ్ కంపోజింగ్ లో ఉన్నాను. కరెక్ట్ గా అదే టైమ్‌లో ఈఎంఐలు కట్టాలంటూ నాకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సాధారణంగా షూటింగ్ లో ఫోన్ వాడను, కానీ ప్రొడక్షన్ నుంచి కాల్ వస్తుందని పక్కన పెట్టుకున్నాను. కానీ రికవరీ ఏజెంట్ల ఫోన్లతో విసుగు వచ్చేసింది. కోపంలో ఫోన్ పగలగొట్టేద్దామనుకున్నాను” అంటూ ఆ క్షణాలను గుర్తుచేసుకున్నారు సందీప్.
ఫోన్ లైట్‌తోనే ఆ మ్యాజిక్..
ఫోన్ చేతిలోకి తీసుకోగానే సందీప్ మైండ్‌లో ఒక మెరుపు మెరిసింది. వెంటనే సెట్లోని లైట్లన్నీ ఆపేయమని చెప్పి, కేవలం ఫోన్ లైట్ సహాయంతో ఆ హుక్‌స్టెప్‌ను కంపోజ్ చేశారట. అది చూసిన ఆయన భార్య జ్యోతి వెంటనే చప్పట్లు కొట్టడంతో.. అదే ఫైనల్ అని ఫిక్స్ అయ్యారు.
మెగాస్టార్ గ్రేస్ తో నెక్స్ట్ లెవల్!
ఆ ఐడియాను మెగాస్టార్ చిరంజీవికి చెప్పగానే, ఆయన తనదైన స్టైల్ మరియు గ్రేస్‌ను దానికి జోడించారు. ఇప్పుడు థియేటర్లలో జనాలు సీట్లలో కూర్చోలేక డాన్సులు చేస్తున్నారంటే కారణం ఆ స్టెప్పే! ఈఎంఐ టెన్షన్ చివరకు ఒక మెగా బ్లాక్ బస్టర్ స్టెప్‌కు దారితీస్తుందని సందీప్ మాస్టర్ కూడా ఊహించి ఉండరు.
