సినిమా వార్తలు

బ్రహ్మానందం కాళ్లు పట్టుకున్న TV5 మూర్తి! అసలు ఆ 30 మిస్డ్ కాల్స్ కథేంటి?ఏం జరిగింది?

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) బర్త్‌డే వేడుకల్లో ఒక అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఎప్పుడూ పదునైన విమర్శలతో, ఎదుటివారిని గడగడలాడించే TV5 మూర్తి (TV5 Murthy), ఒక్కసారిగా బ్రహ్మానందం కాళ్లపై పడి పాదాభివందనం చేశారు. అందరినీ షాక్‌కు గురిచేసిన ఈ సంఘటన వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు!

బ్రహ్మానందం ఒక నటుడు కాదు.. ఒక ‘స్థితి’!

వేదికపై ప్రసంగిస్తూ మూర్తి గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బ్రహ్మానందం అంటే కేవలం ఒక నటుడు కాదు, ఆయన ఒక స్థితి.. ఒక అద్వైత అనుభూతి. కారణం లేకుండా మనకి ఆనందాన్ని ఇచ్చే ఆ ‘బ్రహ్మ పదార్థం’ ఆయనే” అంటూ బ్రహ్మానందం గారిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.

ఆయన నా ‘బ్రహ్మి గాడ్’ (Brahmi God)!

చిన్నప్పటి నుండి సినిమాల్లో ఎంతో మందిని చూసినా, బ్రహ్మానందం గారు తనకు ఒక తత్వవేత్తలా కనిపిస్తారని మూర్తి తెలిపారు. “ఆయన్ని అందరూ ప్రేమిగాడు అని పిలుస్తారేమో కానీ, నాకైతే ఆయన ‘బ్రహ్మి గాడ్'” అంటూ కొత్త పేరు పెట్టారు. మనం పడి పడి నవ్వుతున్నప్పుడు అహంకారం మర్చిపోయి ఏ స్థితిలో ఉంటామో, అదే నిజమైన ‘బ్రహ్మానంద స్థితి’ అని ఆయన విశ్లేషించారు.

30 మిస్డ్ కాల్స్.. అసలు ట్విస్ట్ ఇదే!

మూర్తి ప్రసంగంలో మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఒకసారి తన ఫోన్ చూసుకుంటే బ్రహ్మానందం గారి నుండి ఏకంగా 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయట! ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన ఎందుకు ఫోన్ చేశారు? అన్న విషయాలను కూడా మూర్తి గారు బయటపెట్టారు.

మూర్తి మాట్లాడుతూ.. ఒకరోజు నా ఫోన్‌లో 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. చూస్తే అవి బ్రహ్మానందం గారి దగ్గర నుండి వచ్చినవి. నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఫోన్ చేసి నా షోలలో నేను మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ, తెలుగు మరియు ఆంగ్ల సాహిత్యంలో ఉన్న గొప్ప కవుల కోట్స్ కూడా చెప్పారు . ఆయన మన తెలుగు జాతి సొత్తు. కాలం ఉన్నంత వరకు ఆయన డిజిటల్ డివైజ్‌లలో ఉండి తీరుతారు అన్నారు.

బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి జ్ఞాన, దైవ, భక్తి మార్గాలు చాలా ఉన్నాయి, కానీ ప్రజలు ‘నవ్వు’ అనే మార్గాన్ని మర్చిపోయారు. ఆ నవ్వు అనే మార్గం ద్వారా తెలుగు జాతికి బ్రహ్మానంద స్థితిని ప్రసాదిస్తున్న బ్రహ్మానందం గారికి పాదాభివందనాలు అంటూ వేదికపైనే బ్రహ్మానందం గారి పాదాలకు నమస్కరించి తన గౌరవాన్ని చాటుకున్నారు.

తెలుగు జాతి గర్వించదగ్గ సొత్తు..

డిజిటల్ యుగంలో మీమ్స్ ద్వారా ప్రతిరోజూ మనల్ని పలకరిస్తున్న బ్రహ్మానందం గారు వందేళ్లు కాదు, కాలం ఉన్నంత వరకు మన మధ్యే ఉంటారని, నవ్వు అనే మార్గం ద్వారా తెలుగు వారికి ముక్తిని ప్రసాదిస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు.

Similar Posts