సినిమా పరిశ్రమలో వివాదాలు ఇక నిత్యకృత్యం అయిపోయాయి. ఒక్కోసారి ఫ్యాన్స్‌కు ఓ షాక్, మరోసారి మీడియాకు ఒక పెద్ద హెడ్లైన్!
ఇప్పుడు ఇదే ట్రెండ్ మలయాళ ఇండస్ట్రీలోనూ తీవ్రంగా కనిపిస్తోంది. ఒక్కప్పుడు కథా విన్యాసాలు, నటన అద్భుతాలు చెప్పుకుంటూ సాగిన మళయాళ సినిమా ప్రపంచం… ఇప్పుడు వివాదాలు, పోలీస్ కేసులు, సోషల్ మీడియా వార్‌లు వల్లనే వార్తల్లోకి వస్తోంది.
ఒకప్పటి స్టార్ హీరోల నుంచి యువ నటుల దాకా… అందరూ ఏదో ఒక అంశం మీద వివాదాల్లో పడటం అలవాటైపోయింది. ఇప్పుడు అదే కోవలోకి వెళ్లిపోయిన మరో పేరు ఉన్ని ముకుందన్. ‘మార్కో’ అనే బ్లాక్‌బస్టర్ హిట్‌తో కెరీర్ బిగ్గెస్ట్ హైట్‌కి వెళ్లిన ఆయన, ఒకే ఒక్క సంఘటనతో నెగటివ్ లైమ్లైట్‌లోకి వచ్చారు.
ఇంతకీ… అసలు విషయమేంటీ? ఉన్ని ముకుందన్‌పై నమోదైన కేసు ఏమిటి? వివరాల్లోకి వెళ్దాం.
తాజాగా ఉన్ని ముకుందన్ పై అతని మాజీ మేనేజర్ విపిన్ కుమార్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. విపిన్ చెప్పిన వివరాల ప్రకారం — అతను తన ఫేస్‌బుక్‌లో హీరో టొవినో థామస్ ‘నరివేట్టా’ సినిమాకు సంబంధించిన ఓ పోస్టు పెట్టాడట. అదే విషయాన్ని చూసిన ఉన్ని ముకుందన్ తీవ్రంగా మండిపడి, విపిన్‌ను బూతులు తిట్టి, శారీరకంగా దాడి చేశాడట.
ఈ ఘటన తర్వాత గాయాలపాలైన విపిన్, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఆరోగ్యం కుదుటపడిన వెంటనే డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడని సమాచారం. ప్రస్తుతం ఉన్ని ముకుందన్‌పై ఫిర్యాదు నమోదయినప్పటికీ, అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అన్నది లేటెస్ట్ అప్‌డేట్.
ఇది తొలి సారి కాదు. ఉన్ని ముకుందన్ మీద ఇటువంటి ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. 2018లో ఓ మహిళ లైంగిక వేధింపుల కేసుతో ఆయనపై కేసు వేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ కేసు చివరకు కోర్టులో కొట్టివేసారు. కానీ, అప్పట్లో తీవ్ర స్థాయిలో న్యూస్ హైలైట్ అయింది.
ఇలా చూస్తే… ఉన్ని ముకుందన్ పేరు తరచూ సినిమాల కంటే వివాదాల ద్వారా ఎక్కువగా వినిపిస్తోందనేది నిజమే!