సినిమా వార్తలు

‘ఉస్తాద్’ లో పవన్ పాత సూపర్ హిట్ సాంగ్ ! థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

పాత పాటలకు పవన్ కళ్యాణ్ స్టైల్ తోడైతే ఆ కిక్కే వేరు. కానీ ఇప్పుడు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ క్లాసిక్ సాంగ్‌ను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రీమిక్స్ చేస్తున్నారనే వార్త నెట్టింట మంట పుట్టిస్తోంది. ఆ పాట ఏంటో తెలిస్తే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ!

వివరాల్లోకి వెళితే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే ఒక వైబ్రేషన్. వీరిద్దరి కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ లీకైంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘తొలిప్రేమ’లోని ఒక ఐకానిక్ సాంగ్‌ను ఈ సినిమాలో రీమిక్స్ చేస్తున్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ హింట్ ఇచ్చారు.

అసలు మ్యాటర్ ఇదే :

తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి మధ్య వచ్చే అద్భుతమైన మెలోడీ, ఇప్పటికీ అందరి ఫేవరెట్ అయిన “ఈ మనసే సే సే” సాంగ్‌ను ఉస్తాద్ కోసం రీమిక్స్ చేశారట. అప్పట్లో ఆ పాట ఒక సెన్సేషన్. ఇప్పుడు అదే పాటను పవన్ కళ్యాణ్, నేటి తరం సెన్సేషన్ శ్రీలీల మీద పిక్చరైజ్ చేసినట్లు సమాచారం.

ఈ పాటలో పవన్ కళ్యాణ్ వింటేజ్ గ్రేస్, శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయట. ఈ రీమిక్స్ వెర్షన్ పాత తరం అభిమానులకు నోస్టాల్జియాను ఇస్తూనే, ఇప్పటి జనరేషన్‌ను ఉర్రూతలూగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19, 2026న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

వింటేజ్ పవన్ కళ్యాణ్ మ్యాజిక్ మళ్ళీ తెరపై చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఒక పెద్ద పండగ లాంటి వార్త. మరి శ్రీలీల తన డాన్స్ తో ఈ సాంగ్ కు ఏ రేంజ్ లో గ్లామర్ యాడ్ చేసిందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. సోషల్ మీడియాలో ఈ లీక్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో ఉంది!

Similar Posts