పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు అఫీషియల్ గా అదిరిపోయే కిక్కు ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికెట్ దక్కించుకోవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపుపై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం బాక్సాఫీస్ దగ్గర టికెట్ల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో రేట్లు.. మైండ్ బ్లాక్ ఫిగర్స్!
ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు భారీగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ధరలు ఇలా ఉన్నాయి:
బెనిఫిట్ షోలు: ఒక్కో టికెట్ ధర ₹500 (ఫ్లాట్) గా ఫిక్స్ చేశారు.
సింగిల్ స్క్రీన్స్: రెగ్యులర్ రేట్లపై అదనంగా ₹100 పెంచుకోవచ్చు.
మల్టీప్లెక్స్‌లు: రెగ్యులర్ రేట్లపై అదనంగా ₹125 పెంపుకు అనుమతి లభించింది.

తెలంగాణలో పరిస్థితి.. షో టైమింగ్స్ ఇవే!
తెలంగాణలో మాత్రం మేకర్స్ ఎటువంటి టికెట్ రేట్లు పెంచడం లేదు, అక్కడ పాత జీవో ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే మార్చి 18న ఎక్కడా ప్రీమియర్ షోలు ఉండవు, మార్చి 19 ఉదయం నుండే అసలు సిసలైన రచ్చ మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారుజామున 4-5 గంటలకే ఆటలు మొదలవుతుండగా, తెలంగాణలో ఉదయం 7 గంటల నుండి షోలు పడనున్నాయి.
గబ్బర్ సింగ్ కాంబో.. మళ్ళీ అదే మ్యాజిక్!
2012లో ‘గబ్బర్ సింగ్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో రాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది ‘తేరి’ రీమేక్ కాదని టీమ్ ఇప్పటికే క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
మాస్ జాతర మొదలవ్వడానికి ఇంకా కొద్దిరోజులే సమయం ఉంది. మరి ఈ ₹500 టికెట్లతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తాడో చూడాలి.
సినిమాకు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం ట్యూన్ అయి ఉండండి!

