
విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’ ,30 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి ప్రయోగం, బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా?
తెలుగు సినీ చరిత్రలో డైలాగులు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఒకే ఒక్క సినిమా ‘పుష్పక విమానం’. అప్పట్లో కమల్ హాసన్ తన కళ్లతోనే నవరసాలు పలికించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. మళ్ళీ ఇన్నాళ్లకు, సరిగ్గా అలాంటి అరుదైన ‘మూకీ’ (Silent) సినిమాతో మన ముందుకు వస్తున్నాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. ఆయన నటిస్తున్న ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks) ట్రైలర్ ఇప్పడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది!
మాటల్లేవ్.. ఓన్లీ ఎమోషన్స్!
సినిమా అంటేనే డైలాగుల యుద్ధం అనుకునే కాలంలో.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా సినిమా తీయడం అంటే మామూలు సాహసం కాదు. కానీ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లాంటి దిగ్గజ నటులు ఉన్నప్పుడు మాటలతో పనేముంది? కేవలం తమ హావభావాలతోనే గుండెలకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కిషోర్ పి. బేలేకర్.
రెహమాన్ మ్యూజిక్ విధ్వంసం!
మాటలు లేని సినిమాలో సంగీతమే ప్రాణం. అందుకే ఆ బాధ్యతను ఆస్కార్ విజేత, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ తన భుజాన వేసుకున్నారు. ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది.. రెహమాన్ తన స్వరాలతో ప్రతి సీన్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లారని! మాటలు లేని లోటును తన మ్యూజిక్‌తో భర్తీ చేస్తూ ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నారు.
ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్!
ఈ సినిమాకు భాషతో పనిలేదు, ఎందుకంటే ఇందులో మాటలు ఉండవు. అందుకే దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, మరాఠీ భాషల్లో టైటిల్ కార్డులతో సహా చాలా గ్రాండ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామితో పాటు అతిథి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ కీలక పాత్రల్లో నటించిన ఈ విజువల్ వండర్ జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
‘పుష్పక విమానం’ ఒకప్పుడు క్రియేట్ చేసిన సెన్సేషన్‌ను ‘గాంధీ టాక్స్’ రిపీట్ చేస్తుందా? విజయ్ సేతుపతి చేసిన ఈ రిస్క్ ఆయనకు మరో బ్లాక్ బస్టర్‌ను అందిస్తుందా? అన్నది తెలియాలంటే జనవరి 30 వరకు ఆగాల్సిందే!
