
స్టేజ్ మీదే చెప్పు తీసిన సింగర్! యాంకర్ ‘రేటు’ అడిగినందుకు రచ్చ రచ్చ.. వీడియో వైరల్!
లైవ్ షో అంటేనే రచ్చ రంబోలా.. కానీ ఈసారి జరిగిన సీన్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ప్రముఖ భోజ్‌పురి సింగర్ నిషా ఉపాధ్యాయ్ ఏకంగా స్టేజ్ మీదే ఒక యాంకర్‌కు తన చెప్పు చూపించి బుద్ధి చెప్పింది. పబ్లిక్ అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ‘చెప్పు దెబ్బ’ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తోంది. అసలు ఆ యాంకర్ అంత సాహసం ఎందుకు చేశాడు? నిషా ఎందుకు అంతగా రెచ్చిపోయింది? ఆ షాకింగ్ వివరాలు మీకోసం!
“నీ రేటు ఎంత?” అన్న యాంకర్.. రివర్స్ అయిన సింగర్!
బీహార్‌లో జరిగిన ఒక కల్చరల్ ప్రోగ్రామ్‌లో నిషా ఉపాధ్యాయ్ తన పాటలతో అలరిస్తోంది. అయితే ఆ సమయంలో షో నడిపిస్తున్న యాంకర్ నోరు జారాడు. నిషా పర్ఫార్మెన్స్‌ను మెచ్చుకోకపోగా.. అందరి ముందు మైకులో “నీ రేటు ఎంత?” అంటూ అసభ్యకరమైన ప్రశ్న వేశాడు. ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ అని కూడా చూడకుండా, ఆమె ఫీజు గురించి వల్గర్ గా కామెంట్ చేయడంతో నిషాకు ఒళ్లు మండిపోయింది.
షూ తీసి మరీ బుద్ధి చెప్పిన నిషా!
యాంకర్ మాటలకు ఒక్కసారిగా షాక్ తిన్న నిషా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ మీదే తన చెప్పు తీసి అతన్ని కొట్టడానికి సిద్ధమైంది. ఆవేశంతో ఊగిపోతూ ఆమె చేసిన పని చూసి ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోయారు. వెంటనే అక్కడున్న వారు జోక్యం చేసుకుని ఆమెను శాంతపరిచారు. ఈ దెబ్బతో సదరు యాంకర్ గాలి తీసినట్లయింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో నిలిచింది.
ఎవరీ నిషా ఉపాధ్యాయ్?
भोजपुरी सिंगर निशा उपाध्याय ने भरे मंच पर एंकर को चप्पल मार दी। आरोप है कि एंकर निशा उपाध्याय का रेट बता रहा था। भोजपुरी स्टेज शो आजकल सॉफ्ट पोर्न में बदल गया है, जहाँ फूहड़ता की सारी हदें पार की जा रही हैं। सरकार डीजे बंद कर रही है, लेकिन अश्लील और फूहड़ स्टेज शो पर कुछ नहीं बोल… pic.twitter.com/TL3CHGrQLf
— The Bihar (@thebiharoffice) February 23, 2026
బీహార్‌లోని శరణ్ జిల్లాకు చెందిన నిషా ఉపాధ్యాయ్, ప్రస్తుతం పాట్నాలో ఉంటోంది. భోజ్‌పురి జానపద గీతాలతో అతి తక్కువ కాలంలోనే మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ‘లె లే ఆయే కోకాకోలా’, ‘హన్సీ హన్సీ జాన్ మారేలా’ వంటి సూపర్ హిట్ సాంగ్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. తన ఆత్మగౌరవం దెబ్బతింటే ఎంతటి వారినైనా ఎదిరిస్తుందని ఈ ఘటనతో మరోసారి ప్రూవ్ చేసింది.
కళాకారులను గౌరవించాల్సింది పోయి, ఇలా బహిరంగంగా వారి ‘రేటు’ అడగడం ఎంతవరకు సమంజసం? నిషా తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్లు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. “తప్పు చేసినప్పుడు చెప్పు తీయడంలో తప్పులేదు” అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఏది ఏమైనా, స్టేజ్ పై వల్గారిటీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో నిషా ఉపాధ్యాయ్ చేసిన ఈ పని ఒక పెద్ద గుణపాఠం అనే చెప్పాలి!
