సినిమా వార్తలు

Funky: విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్! రిలీజ్‌కు ముందే కోట్లలో లాభాలా?!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తనదైన స్టైల్‌లో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అయిపోయారు. ఆయన నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ఫంకీ’ (Funky) ఈ రోజు థియేటర్స్ లో దిగింది. అలాగే ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, థియేటర్లలో బొమ్మ పడకముందే ఈ సినిమా కోట్లు కొల్లగొట్టిందన్న వార్త ఇప్పుడు ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

నాన్-థియేట్రికల్ డీల్: 13 కోట్లు ఫిక్స్!

విశ్వక్ సేన్ సినిమాలకు యువతలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ‘ఫంకీ’ శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారానే దాదాపు రూ. 13 కోట్లు రాబట్టిందని తెలుస్తోంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్ (Netflix) సంస్థ ఒక్కటే డిజిటల్ హక్కుల కోసం రూ. 9 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ స్థాయిలో ఓటీటీ డీల్ కుదరడం విశ్వక్ సేన్ మార్కెట్ స్టామినాకు నిదర్శనం.

థియేటర్ కలెక్షన్ల టార్గెట్ ఎంత?

రిలీజ్‌కు ముందే మేకర్స్ సేఫ్ జోన్‌లోకి వెళ్లినప్పటికీ, థియేట్రికల్ రన్ కూడా చాలా కీలకం. ఈ సినిమా గట్టెక్కాలంటే థియేటర్ల నుంచి మరో రూ. 10 కోట్లు వసూలు చేస్తే చాలు.. పక్కా కమర్షియల్ హిట్‌గా నిలుస్తుంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఒకవేళ ‘ఫంకీ’ కి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ టార్గెట్‌ను దాటి సితార ఖాతాలో భారీ లాభాలు చేరడం ఖాయం.

అసలు ఏంటా ‘ఫంకీ’ కథ?

విశ్వక్ సేన్ ఈ సినిమాలో ఒక విభిన్నమైన రోల్‌లో కనిపించబోతున్నాడు. సినిమా దర్శకుడుగా, నిర్మాత కుమార్తెతో లవ్ స్టోరీ నడుపుతూ ఫన్ పుట్టించనున్నారు. ఫన్, ఎమోషన్స్ మరియు యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో కూడిన పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను మలిచినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు, విశ్వక్ సేన్ ఎనర్జీ తోడవ్వడంతో ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు.

Similar Posts