సినిమా వార్తలు

బాల్స్ కూడా నొక్కేస్తారు..అందుకే బాలయ్య అలా వైల్ట్ గా రియాక్ట్ అవుతారు

సెలబ్రిటీ అంటే క్రేజ్… ఆ క్రేజ్‌కి హద్దులే ఉండవు. మూవీ ఫంక్షన్ అయినా, ఆడియో లాంచ్ అయినా, ఎయిర్‌పోర్ట్ అయినా — హీరో ఒక్కసారి కనిపించాడంటే అభిమానులు చుట్టుముట్టడం కామన్. ఒక ఫోటో, ఒక హ్యాండ్‌షేక్, ఒక్క సెల్ఫీ… అంతే చాలు అనుకుంటారు. కానీ… అలాంటి క్షణాల్లో పబ్లిక్‌కు కనిపించని డార్క్ సైడ్ ఒకటి ఉందని, అలాంటి పరిస్దితుల్లో చాలా మంది స్టార్స్ లో కలిగే విసుగు, బిహేవిరియర్ వెనుక అసలు నిజాన్ని బయటపెట్టారు దర్శకుడు పూరి జగన్నాథ్. అదే సమయంలో బాలయ్య పబ్లిక్ లో ఒక్కోసారి ఎందుకు విసుగ్గా ఉంటారో కూడా వివరించారు.

హీరోలకూ అదే టార్చర్… కానీ బయటకి చెప్పరు!

సాధారణంగా ఇలాంటి ఇబ్బందులు హీరోయిన్లకే ఎక్కువగా ఎదురవుతాయని అనుకుంటాం. కానీ పూరి చెప్పింది మాత్రం షాకింగ్.

“హీరోయిన్లే కాదు… హీరోలను కూడా పబ్లిక్ చాలా ఇబ్బంది పెడతారు. జేబుల్లో చేతులు పెడతారు… ఒంటిమీద ఉన్న బంగారం లాక్కెళ్తారు… చేతిలో ఫోన్ మాయం చేస్తారు… ఎక్కడెక్కడో టచ్ చేస్తారు… హీరోల బాల్స్ కూడా నొక్కేస్తారు… కానీ హీరోలు ఎవరూ బయటకి చెప్పరు” అంటూ పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందుకే బాలయ్య దగ్గరకి వస్తే… దూరం పెడతారు!

ఇలాంటి అసహ్యకరమైన పరిస్థితులు రాకుండా ఉండేందుకే బాలకృష్ణ తన దగ్గరకి ఎవరైనా హద్దులు దాటితే వెంటనే రియాక్ట్ అవుతారు అని పూరి స్పష్టం చేశారు. పబ్లిక్‌లో బాలయ్య
విసుక్కోవటం, గట్టిగా అరవటం, దగ్గరకి వచ్చిన వాళ్లను తోసేయటం, కొట్టినట్టు కనిపించటం ఇవన్నీ చూసి చాలా మంది “ఇంత అహంకారమా?”, “ఫ్యాన్స్‌ని ఇలా ట్రీట్ చేస్తారా?” అని తప్పుబడుతుంటారు. కానీ… అవి అహంకారపు చేష్టలు కాదు… సెల్ఫ్ డిఫెన్స్ అని పూరి చెబుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో!

పూరి చేసిన ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నాళ్లు బాలయ్య ప్రవర్తనను తప్పుగా చూసిన వాళ్లకు, ఇప్పుడు దాని వెనక ఉన్న నిజమైన కారణం అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఏదైమైనా బాలయ్య అగ్రెషన్ కాదు… సేఫ్టీ రియాక్షన్!

బాలకృష్ణ పబ్లిక్‌లో చూపించే రఫ్ బిహేవియర్ అహంకారం కాదు… ఫ్యాన్స్‌పై ద్వేషం కాదు… అది తన వ్యక్తిగత భద్రత కోసం, అసభ్యమైన టార్చర్ నుంచి తప్పించుకోవడానికి, హద్దులు దాటే ప్రవర్తనకు చెక్ పెట్టడానికి అని దర్శకుడు పూరి జగన్నాథ్ మాటల్లో స్పష్టమైంది. అందుకే…ఇక నుంచి బాలయ్య రియాక్షన్ చూసి వెంటనే జడ్జ్ చేయడానికి ముందు, దాని వెనక ఉన్న నిజాన్ని ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిందే.

Similar Posts