బాలీవుడ్‌ను శాసించిన బ్యానర్ మౌనంగా తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీని షాక్‌లోకి నెట్టింది… “దిల్‌వాలే దుల్హనియా నుంచి పధాన్” వరకు — భారీ స్కేల్, స్టార్ పవర్, స్లిక్ యాక్షన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు యష్ రాజ్ ఫిల్మ్స్. కానీ ‘Thugs of Hindostan’, ‘War 2’ లాంటి హైపర్ ప్రాజెక్టులు డిజాస్టర్స్ కావడంతో, ఈ ప్రెస్టీజ్ బ్యానర్ ఇప్పుడు అడుగు వేయడానికి ముందు కూడా మూడు సార్లు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇక తాజా షాక్ ఏంటంటే… యూనివర్స్‌లోని అతి అంబీషస్ ప్రాజెక్ట్ ‘Alpha’ మీద పెద్ద నిర్ణయం తీసుకుంది YRF!
ఆల్ఫా రిలీజ్ డేట్ బిగ్ ట్విస్ట్
మొదట 2025 క్రిస్మస్‌కు రావాల్సిన ఈ మెగా యాక్షన్ డ్రామా… ఇప్పుడు నేరుగా ఏప్రిల్ 17, 2026 కు వాయిదా!
అదేంటి? ఎందుకు?
డెడ్‌లైన్ పిచ్చి కాదు… క్వాలిటీకే ప్రాధాన్యం. సెట్‌లు, స్టార్స్, స్కేల్ అన్నీ ఉన్నా… విజువల్స్ పేలవమైతే ఈరోజు ఆడియన్స్ మన్నించరు — ఈ రియాలిటీని YRF గ్రహించింది. అందుకే షూటింగ్ పూర్తయినా భారీ VFX పనులు ఇంకా ట్రాక్‌లో నుంచే ఉన్నాయి. రిలీజ్ ని రష్ చేయకుండా వెనక్కి నెట్టేశారు
ఇది స్పష్టమైన సందేశం:
“మేము వచ్చేది… బిగ్ ఇంపాక్ట్ కోసం మాత్రమే. స్పీడు మా లక్ష్యం కాదు.”
ఇది ఏకంగా యష్ రాజ్ స్పై యూనివర్స్ లో మరో క్రిటికల్ పీసు. సల్మాన్ – షారూఖ్ – హృతిక్ – రణ్వీర్ ప్రపంచంలోకి…కొత్త ఏజెంట్లు అడుగు పెడుతున్నారు.
ఫ్యాన్స్ మైండ్‌లో ఇప్పుడు ఒక్క ప్రశ్న
“War 2 తర్వాత YRF రిడెంప్షన్ ఇదేనా?” …“లేదా ఇండస్ట్రీ గేమ్ మారే బ్లాక్‌బస్టర్ సిద్ధమా?”
బాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఏప్రిల్ 2026 కోసం టైమర్ పెట్టేసింది.
YRF… ఇది కంబ్యాక్ ఆ? లేక క్రౌన్ రిటర్న్ ఆ?

