పొలిటికల్ థ్రిల్లర్ Kuberaa హిట్ తర్వాత, ధనుష్ తన నెక్స్ట్ మూవీ మీద ఫుల్ స్పీడ్లో ఉన్నాడు. డైరెక్టర్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఓ పీరియడ్ డ్రామా. స్టోరీ సెట్‌యింగ్, మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్ అన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఫిక్స్ అయ్యిందని పెద్ద ఎత్తున రిపోర్ట్స్ వచ్చాయి. పూజ ఫ్యాన్స్ ఈ వార్తతో ఖుషీ అయ్యారు. కానీ, ఇప్పుడు షాకింగ్ ట్విస్ట్: పూజ పక్కకు… మమిత బైజు Confirm!

మార్పు వెనుక కారణాలేంటి?

డేట్స్ క్లాష్? లేక.. పారితోషికం సమస్యా?
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, పూజా హెగ్డే ఈ మధ్య వరుసగా తమిళ-తెలుగు bilinguals, బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఈ సినిమాలో ప్లాన్ చేసిన లాంగ్ షెడ్యూల్స్‌కి ఆమె డేట్స్ కుదరకపోవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.

డైరెక్టర్ విజన్ మారిందా?

విఘ్నేష్ రాజా గతంలో Por Thozhil లాంటి కొత్తదనం ఉన్న కథను చెప్పినవాడు. ఈసారి కథలోని లీడ్ ఫీమేల్ పాత్ర కొంచెం రీబెల్, రియలిస్టిక్ టోన్‌లో ఉంటుందని వినికిడి. అలా చూస్తే పూజ కన్నా మమిత బైజు లాంటి ఫ్రెష్ ఫేస్‌కి స్క్రిప్ట్ బాగా సెట్ అవుతుందని డైరెక్టర్ భావించిందనేది ఓ కోణం.

“Premalu” ఎఫెక్ట్!

‘Premalu’ విజయంతో మమిత బైజు క్రేజ్ హఠాత్తుగా పెరిగింది. ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకున్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ మమిత పేరునే ఫైనల్ చేసినట్టు సమాచారం.

అసలైతే పూజ ఎందుకు ముందుగా బుక్కయ్యిందిలా ఊదరగొట్టారు?
ఈ ప్రశ్నకు ఒక్కే సమాధానం – పబ్లిసిటీ స్టంట్?

బిజినెస్ కోణంలో చూస్తే, పూజ హెగ్డే లాంటి స్టార్ పేరు ఉండటం వల్ల ప్రారంభంలో ప్రాజెక్ట్‌కి ప్రొమోషనల్ mileage వచ్చింది. అంతేకాదు, మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్, నిర్మాతలు కూడా ఈ సినిమాను “గ్లామర్ + క్లాస్” టచ్‌తో ప్రమోట్ చేయాలనుకున్నారు. కానీ అసలు గేమ్ ఆల్రెడీ మారిపోయింది!

, , , ,
You may also like
Latest Posts from