సినిమా వార్తలు

125 కోట్ల బిజినెస్ చేసిన ‘అఖండ 2’ ఫస్ట్ వీక్ ఎంత షేర్ వచ్చింది ?

భారీ హైప్‌తో రిలీజ్‌కు ముందే టాలీవుడ్‌ను షేక్ చేసిన సినిమా ‘అఖండ 2’. బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్, మొదటి భాగం సాధించిన సెన్సేషనల్ విజయం, పాన్ ఇండియా టార్గెట్… ఇవన్నీ కలిసి ఈ సీక్వెల్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అంచనాలు వేసారు. కానీ సినిమా థియేటర్లలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి వీకెండ్ నుంచే ఆశించిన రేంజ్ ఓపెనింగ్స్ రాకపోవడం, ఆ వెంటనే వీక్‌డేస్‌లో భారీ డ్రాప్ రావడం వల్ల ‘అఖండ 2’ బాక్సాఫీస్ ప్రయాణం షాకింగ్ టర్న్ తీసుకుంది.

ఫస్ట్ వీక్ లెక్కలు చూస్తే ఈ నిరాశ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి వారం ముగిసే సరికి ‘అఖండ 2’ ప్రపంచవ్యాప్తంగా సుమారు 57 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. ఇందులో ఆంధ్రా, నిజాం ప్రాంతాల జీఎస్టీ కూడా కలిసే ఉంది. వరల్డ్‌వైడ్ గ్రాస్ విషయానికి వస్తే దాదాపు 97 కోట్ల వద్దే సినిమా ఆగిపోయింది. రిలీజ్‌కు ముందు ఉన్న అంచనాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ నంబర్లనే చెప్పాలి.

బిజినెస్ లెక్కలు మరింత షాక్ ఇస్తున్నాయి. మొదట ఈ సినిమాను దాదాపు 125 కోట్ల బిజినెస్‌కు అమ్మారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి అది 110 కోట్లకు రివైజ్ అయ్యింది. చివరికి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల నుంచి సుమారు 95 కోట్లకు ఒప్పుకున్నారు. కానీ ఈ మూడు లెవెల్స్‌లో ఏ లెక్క చూసినా ‘అఖండ 2’ బయ్యర్లకు భారీ నష్టాల సినిమాగా మారినట్టే. ఫస్ట్ వీక్ కలెక్షన్లు చూసిన తర్వాత ఇక రికవరీ కష్టమే అన్న అభిప్రాయం ట్రేడ్‌లో బలంగా వినిపిస్తోంది.

అందరికంటే పెద్ద షాక్ ఏంటంటే, ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో కొనసాగుతున్న సక్సెస్ స్ట్రీక్‌ను బ్రేక్ చేయడం. వరుసగా హిట్స్‌తో దూసుకుపోతున్న బాలయ్య ప్రయాణానికి ‘అఖండ 2’ ఒక్కసారిగా బ్రేక్ వేసినట్టయ్యింది. అదే విధంగా బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌కూ ఇది మొదటి పెద్ద దెబ్బగా మారింది. గతంలో వీరిద్దరి సినిమాలు మాస్ ఆడియెన్స్‌ను గట్టిగా ఆకట్టుకోగా, ఈసారి ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు.

ఇక మరో కీలక చర్చ ఏమిటంటే… ‘అఖండ’ ఫ్రాంచైజీ భవిష్యత్. మొదటి భాగం ఇచ్చిన బ్లాక్‌బస్టర్ ఇమేజ్‌తో ఈ సిరీస్‌ను ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని భావించారు. కానీ ‘అఖండ 2’ ఫలితం చూసిన తర్వాత, ఈ ఫ్రాంచైజీ ఇక్కడితో ముగిసిందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

మొత్తానికి, రిలీజ్‌కు ముందు ఆకాశాన్ని తాకిన హైప్… రిలీజ్ తర్వాత పూర్తిగా తలకిందులైన బాక్సాఫీస్ ప్రయాణం… ఇవన్నీ కలిసి ‘అఖండ 2’ను ఈ ఏడాది పెద్ద షాక్స్‌లో ఒకటిగా నిలిపాయి. బాలయ్య అభిమానులు ఊహించని విధంగా, ఈ సినిమా టాలీవుడ్ ట్రేడ్‌కు కూడా గట్టి జోల్ట్ ఇచ్చిందన్నది ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్న నిజం.

Similar Posts