తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ‘దురంధర’ చిత్రం ప్రభంజనం నడుస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే 900 కోట్లు, 1000 కోట్ల మార్కును అందుకున్న ఈ సినిమాల రికార్డులను చూసి ఇండస్ట్రీ షేక్ అవుతోంది. అయితే, ఈ రికార్డులన్నీ పేకమేడల్లా కూలిపోయే సమయం ఆసన్నమైందని ఫిలిం నగర్ టాక్. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ‘వారణాసి’ (SSMB29) సినిమా ఇప్పుడున్న లెక్కలన్నింటినీ తారుమారు చేయడానికి సిద్ధమవుతోంది.

మూడు పాత్రల్లో మహేష్.. రాముడిగా మెగా సర్ప్రైజ్!
ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అత్యంత క్రేజీ అప్డేట్ ఏంటంటే.. ఇందులో మహేష్ బాబు ఒకటి కాదు, ఏకంగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. త్రేతాయుగం నాటి శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబుని చూడబోతున్నామనే వార్త ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. దీనికి తోడు ఆధునిక కాలంలో గ్లోబ్ ట్రాటర్, హంటర్ (వేటగాడు) గా మహేష్ బాబు తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. ఇలా మూడు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలతో మహేష్ బాబు గ్లోబల్ మార్కెట్‌ను రూల్ చేయబోతున్నారు.

రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్.. 4000 కోట్ల వేట!
రాజమౌళి గారి గత చిత్రాలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్ (RRR) షూటింగ్స్ మెజారిటీ పార్ట్ రామోజీ ఫిలిం సిటీలోనే జరిగాయి. అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ‘వారణాసి’ కోసం కూడా భారీ సెట్లను అక్కడే సిద్ధం చేస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఏకంగా 4000 కోట్ల కలెక్షన్లను టార్గెట్‌గా పెట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. కనిపిస్తున్న మేరలో ఏ సినిమాకు లేని సత్తా ఒక్క ‘వారణాసి’కే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రికార్డుల వేట మొదలైతే రాజమౌళి మార్క్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు స్టైల్, రాజమౌళి విజన్ తోడైతే ఇండియన్ సినిమా చరిత్ర తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

