నల్లమల్ల అడవుల్లోని లింగయ్యగూడెం గ్రామంలో పెరిగిన చిన్నయ్య చురుకైన వాడు.తెలివైనవాడు, అక్కడికి వచ్చిన హెడ్మాస్టర్ చంద్రశేఖర్ (కె.ఎస్ రవికుమార్)అది గమనించి, అతన్ని గొప్పగా తీర్చి దిద్దుతాడు. ఓ కొత్త జీవితం ఇస్తాడు. అతనికి “ఉస్తాద్ భగత్ సింగ్” అనే పేరు పెడతాడు. కాలం గడుస్తుంది. గురువు రాజకీయాల్లోకి వెళ్లి సీఎం అవుతాడు… శిష్యుడు ఐపీఎస్ అవుతాడు. కానీ సిస్టమ్‌లో ఉన్నప్పటికీ, అడవితో తన కనెక్షన్‌ను మాత్రం విడిచిపెట్టడు ఉస్తాద్. ఇక్కడే కథ టర్న్ అవుతుంది.
ఒక ఫంక్షన్లో సీఎంపై జరిగిన దాడి… ఆ తర్వాత వరుసగా సీఎం కుర్చీపై కూర్చునే నాయకులు ఒక్కొక్కరుగా చనిపోవడం జరుగుతూంటుంది. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కల్లోలం సృష్టిస్తుంది. ఈ రక్తపాతానికి వెనుక ఉన్న అసలు గేమ్ మాస్టర్ నల్ల నాగప్ప (పార్ధీపన్). సీఎం కుర్చీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైన అతను, పథకం ప్రకారం వ్యవస్థను కూల్చేస్తూ ముందుకు సాగుతుంటాడు.
ఈ క్రమంలోనే తన గురువు చంద్రశేఖర్‌పై నాగప్ప దాడి చేసిన విషయం ఉస్తాద్‌కు తెలుస్తుంది. అక్కడి నుంచి ఇది వ్యక్తిగత యుద్ధంగా మారుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్‌గా కాదు… ఒక శిష్యుడిగా, ఒక మనిషిగా ఉస్తాద్ రంగంలోకి దిగుతాడు.
కానీ ఇక్కడ ఉస్తాద్ సూటిగా పోరాడడు… గేమ్ ఆడతాడు. ఆ గేమ్ ఏంటి? నాగప్పను ఎలా కట్టడి చేయాలని ప్లాన్ చేస్తాడు? ఇద్దరి మధ్య ఉన్న పాత గొడవ ఏమిటి? అది ఈ స్థాయికి ఎలా వచ్చింది? ఇంకా ఈ కథలో కీలకంగా ఉన్న రెండు పాత్రలు శ్లోక, లీలా ఎవరు. శ్లోక జీవితంలోకి వచ్చాక ఉస్తాద్‌లో ఏ మార్పు వచ్చింది? లీలాతో అతని ప్రేమ కథ ఎలా సాగింది? అది కేవలం లవ్ ట్రాక్ మాత్రమేనా… లేక కథలో కీలక మలుపా?. ఇవి మాత్రమే కాదు…
రాష్ట్ర రాజకీయాల్లో ఉగ్రవాదుల ప్రమేయం ఏమిటి? ఈ మొత్తం గేమ్ వెనుక ఉన్న అసలు అజెండా ఏమిటి?. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అసలు కథ.

ఎనాలసిస్ :
హరీష్ శంకర్ + పవన్ కళ్యాణ్ అంటే ఆటోమేటిక్‌గా Gabbar Singh గుర్తొస్తుంది. అది ఒక వైబ్. ఒక ఎనర్జీ. ఒక స్టైల్.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా అదే వైబ్‌ను మళ్లీ క్యాచ్ చేయాలని ట్రై చేస్తుంది… కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది — వైబ్ రీ-క్రియేట్ అయింది, కానీ ఎక్స్‌పీరియెన్స్ మాత్రం అప్డేట్ కాలేదు.
ఈ సినిమాను చూస్తుంటే ఒక క్లియర్ ఫీలింగ్ వస్తుంది — ఇది ఒకరకంగా “స్పిరిచువల్ సీక్వెల్” మూడ్‌లో ఉంది. హీరో ఇంట్రో నుంచి, సెటప్, మాస్ మూమెంట్స్ అన్నీ Gabbar Singh ను రీకాల్ చేస్తాయి. కానీ క్యారెక్టర్ మాత్రం పూర్తిగా డిఫరెంట్ గేమ్ ఆడుతుంది.
ఇక్కడ భగత్ సింగ్ ఒక యాక్షన్ హీరో కంటే, ఒక “మోటివేషనల్ స్పీకర్ విత్ పంచ్ డైలాగ్స్”లా కనిపిస్తాడు. డిప్రెషన్, లవ్, రిలేషన్షిప్స్, దేశభక్తి, మతం — ఏ టాపిక్ అయినా అతనికి ఓ కోట్ రెడీగా ఉంటుంది.
“Show, don’t tell” అనే బేసిక్ స్క్రీన్‌ప్లే రూల్ ఇక్కడ పూర్తిగా రివర్స్‌లో నడుస్తుంది. అంటే, క్యారెక్టర్ తన యాక్షన్స్ ద్వారా కాదు… తన డైలాగ్స్ ద్వారా డిఫైన్ అవుతుంది. అయినా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల ఇది పూర్తిగా క్రాష్ కాకుండా somehow స్టాండ్ అవుతుంది — ఇదే సినిమా బిగ్గెస్ట్ సేవింగ్ పాయింట్.
సూటిగా చెప్పాలంటే మాస్ వైబ్ ఉంది… కానీ స్టోరీ అప్డేట్ కాలేదు. అలాగే స్టార్‌ను ఎలివేట్ చేయడంలో సక్సెస్. కానీ స్టోరీని ఎలివేట్ చేయడంలో ఫెయిల్. ఇక్కడ మోమెంట్స్ ఉన్నాయి. హైస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. కానీ స్టోరీ మాత్రం అప్డేట్ కాలేదు.— ఫస్ట్ 30–40 నిమిషాలు రష్ + అవుట్‌డేటెడ్ వైబ్. సీన్స్ త్వరగా వస్తాయి… కానీ కనెక్ట్ అవ్వవు ఎమోషన్ ఉంది… కానీ ఫీల్ రావడం లేదు.
సెటప్ ఉంది… కానీ ఎంగేజ్మెంట్ లేదు. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర కూడా అదే సమస్య. కాగితం మీద అది స్ట్రాంగ్ మోమెంట్… కానీ స్క్రీన్ మీద ఫుల్ ఇంపాక్ట్ రాదు. ఆడియన్స్‌కి ఇది ఒక క్లియర్ ఫీలింగ్ ఇస్తుంది: “ఇది నేను ఇప్పటికే చూసినట్టు ఉంది. ఇంటర్వెల్ తర్వాత ఒక రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. రష్ తగ్గుతుంది. నేరేటివ్ కొంచెం స్టేబుల్ అవుతుంది.కానీ సర్ప్రైజ్ లేదు. కొన్నిసార్లు కామెడీ డ్రామాను బ్రేక్ చేస్తుంది. కొన్నిసార్లు డ్రామా కామెడీని కిల్ చేస్తుంది. దాంతో మూడ్ స్టేబుల్‌గా ఉండదు.

నటీనటలు విషయానికి వస్తే..
పవన్ కళ్యాణ్ పూర్తి ఎనర్జీతో ఫుల్ కిల్ చేసాడు. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ all on point. ఫ్యాన్స్‌కు పక్కా ఫీస్ట్. ఇక శ్రీలీల సెకండాఫ్‌లో ఎంట్రీ… స్క్రీన్ మీద క్యూట్ + ఎనర్జిటిక్ వైబ్. గుడ్ ఇంపాక్ట్. రాశీఖన్నా … ఫస్ట్ హాఫ్‌లో స్ట్రాంగ్ ప్రెజెన్స్. కనిపించినంతసేపు attention grab చేస్తుంది.
కేఎస్ రవికుమార్ పాత్ర విషయానికి వస్తే.. గురువు + సీఎం పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్. పార్థిబన్ (విలన్) .. స్టైలిష్ & ఇంటెన్స్. క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ ఫిట్.
టెక్నికల్ గా..
సంగీతం (దేవిశ్రీ ప్రసాద్) ఒక పాట ఫర్వాలేదు, మిగతావి పెద్దగా గుర్తుండవు. అలాగే బీజీఎం (థమన్) రొటీన్‌గా ఉంటుంది, కొత్తగా ఫీల్ రావడం లేదు. విజువల్స్ (అయనంకా బోస్) రిచ్‌గా, క్లీన్‌గా కనిపిస్తాయి. ఎడిటింగ్ (కార్తీక్ శ్రీనివాస్) ఓకే, కానీ ఇంకా కట్టుదిట్టంగా ఉండాల్సింది. కథ, కథనం టెంప్లేట్ ఫీల్, ట్విస్ట్‌లు ఉన్నా పెద్దగా కిక్ ఇవ్వవు. నిర్మాణ విలువలు హై క్వాలిటీ, ఎక్కడా లోపం కనిపించదు.
ఫైనల్ టేక్:
విజువల్స్, నిర్మాణం బాగున్నాయి… కానీ కంటెంట్ మాత్రం పాత స్టైల్లోనే ఉంది.
ఫైనల్ టేక్:
పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఉంటే హై గ్యారెంటీ… కానీ స్క్రిప్ట్ మాత్రం ఓల్డ్ వెర్షన్లోనే రన్ అవుతుంది. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్… మిగతావాళ్లకు ‘ఓకే, చూసాం’ అనిపించే సినిమా

