చిన్న సినిమాలు థియేటర్ లో ఆడటం అరుదైపోయింది. ఎక్కువ ఓటిటిలోనే చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం మరోసారి రుజువైందంటున్నారు ‘లవ్ యాపా’రచయిత స్నేహా దేశాయ్. ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ రిపోర్ట్ వచ్చింది. శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ (Kushi Kapoor), జునైద్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లవ్ యాపా’ (Love Yapa).
తమిళంలో విజయాన్ని అందుకున్న ‘లవ్ టుడే’ (Love Today) చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ‘లవ్ యాపా’ఫెయిల్యూర్ పై తాజాగా చిత్ర రచయిత స్నేహా దేశాయ్ స్పందించారు. ఇది రొటీన్ లవ్ స్టోరీ కాదని.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువమంది దీనిని చూసే వీలుందని చెప్పుకొచ్చారు.
స్నేహా దేశాయ్ మాట్లాడుతూ…‘‘ప్రేక్షకులపై ఒక సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపించిందనేది బాక్సాఫీస్ నంబర్లపై ఎప్పుడూ ఆధారపడి ఉండదు. ‘లవ్ యాపా’ విభిన్నమైన, ఫ్రెష్ లవ్ స్టోరీ. జెన్ జి ప్రేక్షకుల కోసం దీనిని రూపొందించారు. ఇందులోని కంటెంట్, కామెడీకి వారు బాగా కనెక్ట్ అవుతారు. బాలీవుడ్‌లో తెరకెక్కే రొటీన్ రొమాంటిక్ – కామెడీ చిత్రాల మాదిరిగా కాకుండా సరికొత్త సబ్జెట్ మూవీగా దీనిని సిద్ధం చేశాం.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే కోణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. లార్జర్ దెన్ లైఫ్ చిత్రాలను మాత్రమే వారు థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మిగిలిన చిత్రాలను ఓటీటీల్లో చూడాలనుకుంటున్నారు. ఆ కారణం వల్లనే మా సినిమాకు బాక్సాఫీస్ వద్ద సరైన కలెక్షన్స్ వచ్చి ఉండకపోవచ్చు.
ఓటీటీలో ఇది తప్పకుండా విశేష ఆదరణ సొంతం చేసుకుంటుందని నమ్ముతున్నా. ఏది ఏమైనా బిగ్‌స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని చూసిన వారు తమకు ఈ చిత్రం బాగా నచ్చిందని.. కంటెంట్ చాలా కొత్తగా ఉందని ప్రశంసలు కురిపించారు’’ అని ఆమె తెలిపారు.
ఇక ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న చిత్రం ‘లవ్ టుడే’ (Love today). నేటితరం యువతీ యువకుల ప్రేమ కథతో దీనిని రూపొందించారు. ఇదే చిత్రానికి రీమేక్‌గా ‘లవ్ యాపా’ సిద్ధమైంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 7న ఇది థియేటర్లలో విడుదలైంది