సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన సికందర్ సినిమా రిలీజ్ కు ముందు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మోస్ట్ అవైటెడ్‌గా ఉన్న ఈ చిత్రం మార్చి 30న విడుదలైంది. అయితే ఊహించని విధంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ వచ్చింది. చాలా మంది డిజాసట్ర్ అని తేల్చేసారు. రంజాన్ రోజు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. సికందర్ ఆన్‌లైన్ లీక్‌లు, నెగిటివ్ రివ్యూలుతో సతమతవుతున్నాడు.

ఈ సినిమాలో రష్మిక కూడా ప్రధాన పాత్రలో కనిపించింది. సల్మాన్ మరియు రష్మికలకు మొదట్లో మంచి క్రేజ్ వచ్చింది. అయితే రిలీజ్ తర్వాత జనం పెదవి విరిచారు. ఇదే విషయాన్ని తాజాగా ముంబైకి చెందిన గైటీ గెలాక్సీ ఓనర్ మనోజ్ దేశాయ్ సికందర్‌పై ప్రజల స్పందన చెప్పారు. సినిమా ప్రారంభంలోనే రష్మిక పాత్రను సల్మాన్ చంపేశాడని విమర్శించారు.

మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు, “నాకు ప్రజల నుండి సమీక్షలు వచ్చాయి, ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతా కూడా నాతో ఇలా అన్నారు, ‘సినిమాలో ఇంత త్వరగా మొదట్లోనే హీరోయిన్‌ని చంపాల్సిన అవసరం ఏమిటి?’ ‘మీకు ఎలాంటి కాంప్లెక్స్ ఉంది?’ ఆపై, మీరు సినిమాను ముందుకు తీసుకెళ్లినప్పుడు, మీకు ఏదైనా సరిగ్గా లేదని అనిపిస్తే… అసలైన సల్మాన్ ఈ సినిమాలో ఎక్కడున్నాడు?అని ప్రశ్నించారు.

ఇక గైటీ గెలాక్సీ సల్మాన్‌కి రెండో ఇల్లు లాంటిదని, అయితే సికిందర్ గురించి పబ్లిక్‌లు తనకు ఏమి చెప్పారో ఇప్పుడే పంచుకుంటున్నానని చెప్పాడు. అతను ఇలా అన్నాడు, “నేను మీ స్నేహితుడిని, గైటీ గెలాక్సీ మీ రెండవ ఇల్లు కాబట్టి నా ఇంటర్వ్యూ కారణంగా మీరు బాధపడతారని నాకు తెలుసు, కానీ పబ్లిక్ నాకు ఏమి చెబుతుందో నేను చెబుతున్నాను.” అని తేల్చి చెప్పారు.

, ,
You may also like
Latest Posts from